విద్యార్ధులకు నాణ్యమైన విద్యానందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు. మధిర మండలం కమ్మంపాడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ‘‘మన ఊరు, మనబడి’’ కార్యక్రమంలో రూ.98 లక్షల 32 వేలతో ఆధునీకరించిన పాఠశాలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ పున: ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనఊరు మన బడి కార్యక్రమంలో పాఠశాలలో చాక్‌బోర్డులు, డ్యూయల్ డెస్క్‌లు, వాల్‌పెయింటింగ్, టాయిలెట్స్, త్రాగునీరు, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు, కంపౌండ్ వాల్ వంటి సౌకర్యాలు కల్పించడం జరిగిందని, మంచి వాతావరణంలో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి కలుగుతుందని, మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు.
ఉపాధ్యాయులు సరళమైన పద్దతిలో విద్యార్థుల బోధన జరగాలని, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు.పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టరు, జిల్లా పరిషత్ చైర్మన్, వితనాభివృద్ధి సంస్థ చైర్మన్ మొక్కలు నాటారు.అనంతరం మధిర డంపింగ్ యార్డును కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.