24.7 C
Hyderabad
May 17, 2024 00: 08 AM
Slider నల్గొండ

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

#childmarriage

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కార్యాలయంలో మండల అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశం తహశీల్దార్ సాయగౌడ్ ఆధ్వర్యంలో చైల్డ్ లైన్ వారి సౌజన్యంతో ఎం ఎ బి  నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బాల్య వివాహం గురించి ఆడపిల్ల లైంగిక వేధింపులు, బాల సమస్యల గురించి చర్చించడం, వాటిని ఎలా అధిగమించాలో చర్చించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ జానకి రాములు మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని కోరారు.

బాలరక్షా భవన్ కో-ఆర్డినేటర్ వెంకటలక్ష్మి బాలలపై లైంగిక వేధింపులు,అనాధ పిల్లలు,పిల్లల అక్రమ రవాణా,బాల కార్మికులు,పిల్లల సంరక్షణ సమస్యల గురించి వివరించారు.

ఎంపిపి పార్వతి మాట్లాడుతూ పిల్లలు ప్రతి విషయాలలో అప్రమత్తంగా ఉండాలని,అశ్రద్ధగా తీసుకోవద్దని,కిశోర బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు.అనంతరం బాలల పరిరక్షణపై పోస్టర్ ఆవిష్కరణ చేశారు.

ఈకార్యక్రమంలో ఎంపిపి పార్వతి, తహశీల్దార్ సాయగౌడ్, ఎంపిడిఓ జానకి రాములు,బాలరక్షా భవన్ కో-ఆర్డినేటర్ వెంకటలక్ష్మి,సిడిపిఓ విజయలక్ష్మి,ఎస్సై రవి కుమార్,ఎంఈఓ చత్రువు నాయక్, సూపర్వైజర్లు సోమమ్మ,వసంత,చైల్డ్ లైన్ సిబ్బంది సఫియా,మల్లేష్,సాయి, డిఆర్డిఏ సాయమ్మ,శాంత,కస్తూరిబా పాఠశాల ఎస్ వో,గ్రామ కార్యదర్శులు,      ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Bhavani

కరోనా నిబంధనలు పాటించని మండల విద్యాధికారి

Satyam NEWS

2020లో 203 ఉగ్ర‌వాదులు హ‌తం… పాక్ బుద్ధి ఎప్ప‌టికీ మార‌దా?

Sub Editor

Leave a Comment