36.2 C
Hyderabad
May 15, 2024 18: 36 PM
Slider ప్రత్యేకం

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి: రూ.2 లక్షల పరిహారం

#y s jagan 1

తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదానికి కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు వివరించారు. తిరుపతిలో స్థానిక ఆస్పత్రులు స్విమ్స్, రుయా, బర్డ్‌ ఆస్పత్రుల్లో వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, అలాగే గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. బాధితులు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

Related posts

రిమంబరింగ్: నేనూ నా డ్రైవింగ్ లైసెన్సు

Satyam NEWS

పంచాయతీ కార్మికులకు 11వ పీఆర్సీ అమలు చేయాలి

Satyam NEWS

కరోన నుంచి రక్షణ కావాలంటే బయటకు రావద్దు

Satyam NEWS

Leave a Comment