33.7 C
Hyderabad
April 29, 2024 00: 43 AM
Slider జాతీయం

2020లో 203 ఉగ్ర‌వాదులు హ‌తం… పాక్ బుద్ధి ఎప్ప‌టికీ మార‌దా?

Encounter

2020లో కూడా పాకిస్థాన్ క‌వ్వింపు చ‌ర్య‌లు, ఉగ్ర‌వాదుల దాడులను జ‌మ్మూక‌శ్మీర్ ఎదుర్కొంటుంది. కుక్క తోక వంక‌రే అన్న‌ట్లుగా పాక్ చ‌ర్య‌ల‌కు భార‌త్ కూడా ఆయా స‌మ‌యాల్లో ధీటుగా స‌మానాలిచ్చింది. ఎంతోమంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెడుతూనే మ‌రోప‌క్క ఉగ్ర‌వాద దారిని యువ‌త ఎంచుకోకుండా ఉండేందుకు అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డం, ప్ర‌త్యేకంగా నిరుద్యోగులు, యువ‌త కోసం ఉద్యోగాలు క‌ల్పించేందుకు బ‌డ్జెట్‌ను కేటాయించింది.

కాగా 2020లో 203 ఉగ్ర‌వాదుల‌ను భార‌త బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి. ఇందులో 166 మంది స్థానిక ఉగ్ర‌వాదులు కాగా, 37 మంది పాకిస్థాన్‌కు చెందిన వారు కావ‌డం విశేషం. 49 మంది అల్ల‌ర్ల‌కు పాల్ప‌డుతున్న వారిని అరెస్టు చేయ‌గా 9మంది తామంత‌గా తామే పోలీసుల‌కు స‌రెండ‌ర్ అయ్యారు. ద‌క్షిణ క‌శ్మీర్‌లో ఎక్కువ‌మంది ఉగ్ర‌వాదులను భార‌త సైన్యం మ‌ట్టుబెట్టింది. పొంపియో, కుల్‌గామ్‌, పూల్వామాను జ‌ల్లెడ ప‌డుతూ ఆర్మీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్తో ఉగ్ర‌వాదులు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన‌ప్ప‌టికీ, అవ‌త‌లి వైపు నుంచి పాకిస్థాన్ ఉగ్ర‌వాద గ్రూపులు స్థానిక యువ‌కుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్లీస్తుంటారు. 2020లో 96 ఉగ్ర‌వాద దాడులు జ‌ర‌గ్గా, ఇందులో 43 మంది స్థానికులు చ‌నిపోయారు. 92 మంది గాయ‌ప‌డ్డారు. 2019తో 47 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 185 మంది గాయ‌ప‌డ్డారు. ఈ దాడుల్లో 14 ఎల్ఈడీ బాంబులు ల‌భించాయి.

ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

ఇక తాజాగా ల‌భించిన స‌మాచారం ప్ర‌కారం క‌శ్మీర్‌లో భార‌త బ‌ల‌గాలు ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టాయ‌ని క‌శ్మీర్ పోలీసులు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. వివ‌రాల్లోకి వెళితే..

శ్రీ‌న‌గ‌ర్‌లోని లావాపోరా ప్రాంతంలో మంగ‌ళ‌వారం కాల్పులు ప్రారంభం కాగా స‌మాచారం అందుకున్న‌భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పెద్ద ఎత్తున ఉగ్ర‌వాదులు న‌క్కిన‌ ఆ ఇంటిని చుట్టుముట్టాయి. బుధ‌వారం కూడా ఈ ఎన్‌కౌంట‌ర్ కొన‌సాగింది. ఇందు‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌ని పోలీసులు వెల్ల‌డించిన‌ప్ప‌టికీ స్థానికంగా ఇంకా సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. 15 గంట‌లుగా ఓ ఇంట్లో న‌క్కిన ఉగ్ర‌వాదుల‌ను ఎట్ట‌కేల‌కు ఆర్మీ మ‌ట్టుబెట్టింది. పోలీసు, ఆర్మీ ద‌ళాలు ఎల్వోసీ ద‌గ్గ‌ర బాలాకోట్ మేడ‌ర్ సెక్టార్‌లో రెండు పిస్తోళ్ళు, 70 బుల్లెట్లు, రెండు గ్రానైడ్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు స్థానిక పోలీసు ఉన్న‌తాధికారి ర‌మేష్ అగ్ర‌వాల్ మీడియాకు తెలిపారు. పాకిస్థాన్ నుంచి ఆయుధాలు భార‌త్‌లో చొర‌బ‌డుతున్న ఉగ్ర‌వాదుల‌కు అందుతున్నాయ‌న్నారు. ఆదివారంనాడు ఉగ్ర‌వాదుల‌కు స‌హాయం చేస్తున్న ముగ్గురిని అదులోకి తీసుకున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వీరి ద్వారా పైన పేర్కొన్న ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.

Related posts

షర్మిలకు పెద్ద షాక్ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS

అనుబంధాలు పెంచుకోవడం ద్వారా ఆత్మహత్యల నివారణ

Satyam NEWS

తల్లిపాలే బిడ్డలకు ఎంతో శ్రేష్టమైనవి

Satyam NEWS

Leave a Comment