30.2 C
Hyderabad
May 17, 2024 18: 15 PM
Slider నల్గొండ

పాదయాత్ర చేస్తున్న వారిని అరెస్టు చేయడం హేయమైన చర్య

#roshapati

శ్రమజీవుల హక్కుల కోసం సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్న బృందాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల ద్వారా దౌర్జన్యంగా అరెస్టు చేయడం అన్యాయమని,హేయమైన చర్య అని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి విమర్శించినారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్ నందు రాస్తారోకో అనంతరం టిఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రోషపతి మాట్లాడుతూ 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో కనీస వేతన జీవోలు విడుదల చేయాలని,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 79 చట్టాలను సవరణల పేరుతో 4 కోడులని రద్దు చేయాలని, కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని  అన్నారు.పాదయాత్ర చేస్తున్న బృందాన్ని రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర నాయకులు ఎస్ వీరయ్య,భాస్కర్, భూపాల్,విజయలక్ష్మి ని అరెస్టు చేయడం అన్యాయమని,బిజెపికి,టిఆర్ఎస్ పార్టీలకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అరెస్ట్ చేసినవారిని విడుదల చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్,జిల్లా నాయకులు ఉపతల గోవిందు, వెంకన్న,వేణు,రాజేష్,జి.వెంకన్న, బాల సైదులు,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

హెచ్ఓడి లకు కూడా ఇక ఫేస్ రికగ్నిషన్ తప్పని సరి

Satyam NEWS

దిశా స్ఫూర్తితో కేసుల దర్యాప్తు వేగవంతం: ఎస్పీ దీపికాపాటిల్

Satyam NEWS

Analysis: వలసపోతున్న దేశ అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment