24.7 C
Hyderabad
May 17, 2024 02: 39 AM
Slider ముఖ్యంశాలు

ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ లో చేరుటకు ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియ

#education

ములుగు జిల్లాలోని నిరుద్యోగులు,చిరు ఉద్యోగులు,గృహిణులు చదువుకోవాలనే ఆసక్తి ఉండి పాఠశాల విద్య చదువుకోలేక పోయిన వారు దూర విద్యా విధానం ద్వారా పదవ తరగతి,పదవ తరగతిలో ఉత్తీర్ణులైన వారు రెగ్యులర్ ఇంటర్ చదవలేక పోయిన వారికి దూరవిద్యా విధానం ద్వారా ఇంటర్ చదువుకోవడానికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానాన్ని అందిస్తుంది. అందులో భాగంగా 2023 – 24 విద్యా సంవత్సరంలో ఓపెన్ టెన్త్,ఓపెన్ ఇంటర్ లో చేరడానికి చివరిఅవకాశంగా ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 16వ తేదీ నుండి 30 వరకు రాష్ట్ర అధికారులు అవకాశం ఇచ్చినట్లు ములుగు బాలుర ఉన్నత పాఠశాల కో ఆర్డినేటర్ ఎన్నెం విజయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు పరిసర గ్రామాల విద్యాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 10వ తరగతిలో చేరుటకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం,కుల దృవీకరణ పత్రం,ఆధార్ జిరాక్స్,ఒక ఫోటో అలాగే ఓపెన్ ఇంటర్ లో చేరుటకు పదవ తరగతి మెమో,కుల దృవీకరణ పత్రం,ఆధార్ జిరాక్స్,ఫోటో వంటి డాక్యుమెంట్లతో ములుగు బాలుర ఉన్నత పాఠశాల సహాయ కో ఆర్డినేటర్ శిరుప కుమార్ ను సంప్రదించాలని సూచించారు.

Related posts

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీ పర్యాటక రంగానికి నూతనోత్తేజం

Bhavani

ఓగాడ్: నిర్మ‌ల్ జిల్లాలో వలసకూలీలకు రోడ్డు ప్రమాదం

Satyam NEWS

వైవీ సుబ్బారెడ్డికి సుబ్రహ్మణ్య స్వామి బాసట

Satyam NEWS

Leave a Comment