34.2 C
Hyderabad
May 16, 2024 15: 15 PM
Slider వరంగల్

నాగజ్యోతిని దీవించిన కల్యాణలక్ష్మీ కుటుంబం

#nagajyothy

“జ్యోతక్క  నువ్వు గెలవాలి. మన బాబు కేసీఆర్ చల్లంగా ఉండాలి. అప్పుడు మా ఇల్లు, ఇంట్లో పైసలు కాలిపోతే బాపు కేసీఆర్ నా పెళ్లి చేసిండు. రెండు ఏ ళ్ల క్రితం కేసీఆర్ చెపితే పెద్ది సుదర్శన్ రెడ్డి నా బిడ్డ పెళ్లి చేసిండు. నేను కేసీఆర్కు రుణపడి ఉన్న. 20 ఏండ్ల  కింద తండా నిద్రలో భాగంగా కేసీఆర్ నా పెళ్లి చేయడం, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ వెనువెంటనే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి ప్రతి పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిండు. నా ద్వారా నా కుటుంబంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి లబ్ధి చేకూరింది.

ఇందుకు కారణం మా ఇంటి లో జరిగిన సంఘటన. అందుకు మేము కారణం కావడం ఇప్పుడు సంతోషంగా ఉంది. ఆ తర్వాత క్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారిని కలిసి ధన్యవాదాలు చెప్పుదామనుకున్నాం. కానీ ఇప్పటివరకు ఆ వీలు కలగలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు ఆశీర్వదించి పంపిన బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని మేము కలిసి ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలపాల్సిందిగా  మా ఇంటికి ఆహ్వానించాం” . తమ మాటగా  ముఖ్యమంత్రి గారికి చెప్పాలని  కీమా నాయక్, ఆయన కూతురు కల్పన దంపతులు మీడియా వివరించారు.  బడే నాగజ్యోతిని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టడంతో పాటు చీర శారీలను అందించినట్లు కల్పన – యాకు, కిమా నాయక్ దంపతులు  వెల్లడించారు.

ఇదిలా ఉండగా కిమానాయక్ ఇంట్ల జరిగిన సంఘటన వల్ల ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి ప్రవేశపెట్టడం, దాని ద్వారా తాము కూడా లబ్ధి పొందామని 70 మంది  భాగ్య తండావాసులు  నాగజ్యోతి,  ts రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ వంతుగా ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలపాలని లబ్ధిదారులు చెప్పారు.

ఈ సందర్భంగా కీమానాయక్‌ మాట్లాడుతూ నాడు ఉద్యమ నాయకుడిగా 20ఏళ్ళ కింద సీఎం కేసీఆర్‌ వచ్చి తన కూతురు కల్పన పెండ్లీని సొంత ఖర్చులతో చేసి దీవించాడని అన్నారు. రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి హోదాలో తన మనవరాలు చంద్రకళ పెండ్లీ చేయించే బాధ్యతను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి అప్పగించి ఘనంగా జరిగేలా చేశాడని తెలిపారు. ఉద్యమ సమయంలో ఆడపిల్ల పెండ్లీ కష్టాన్ని తెలుసుకున్న కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక కల్యాణలక్ష్మీ లాంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాడని అన్నారు. ఇలాంటి గొప్ప పథకానికి తమ కుటుంబం కారణం కావడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు.

టీఎస్ రెడ్కో చైర్మన్‌ వై. సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ భాగ్యతండా గ్రామంతో పాటు కల్యాణ లక్ష్మీ పథకానికి కారకులైన కీమానాయక్‌ అతని కుమార్తె కల్పనలు చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కల్పన వంటి ఆడబిడ్డల దీవెనలు ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి ఢోకా లేదన్నారు.

Related posts

వి.వి.వినాయక్ శిష్యుడు విశ్వ తొలిచిత్రం గీత కు విశేష స్పందన

Satyam NEWS

అక్రమ ఆస్తుల కేసులో నిందితుడైన పాక్ నేతకు కరోనా

Satyam NEWS

వెరైటీ మ్యారేజ్ : సెలవు దొరక్క వరుడి సోదరితో వధువు పెళ్లి

Satyam NEWS

Leave a Comment