28.2 C
Hyderabad
May 17, 2024 10: 48 AM
Slider వరంగల్

మేడారం భక్తుల సౌకర్యార్థం వసతి గృహాల నిర్మాణం

#mulugu

ములుగు జిల్లాలోని ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూజిల్లా ప్రజలకు వైద్యం, విద్య, పోషకాహారం అందేందుకు ఆయా శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి నెలలో జరిగే మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాటను పూర్తి చేశామన్నారు. భక్తులు వారం వారం అధిక సంఖ్యలో వస్తున్న కారణంగా భక్తుల కోసం చేపట్టిన 3 వసతి గృహాల నిర్మాణాన్ని జూలై మాసం కల్లా పూర్తి చేస్తామన్నారు. రూ.1.7 కోట్లతో ములుగు మండలం ఇంచర్ల, గోవిందరావుపేట మండలం చల్వాయి తోపాటు తాడ్వాయి మండల కేంద్రంలో మూడు వసతి షెడ్ ల నిర్మాణాన్ని చేపట్టి ప్రత్యేకంగా కిచెన్ షెడ్యూల్ సైతం నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఒక్కో షెడ్ లో 300 మంది భక్తులకు  సౌకర్యవంతంగా ఉండే వసతులను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. వీటితోపాటు ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ దేవాలయం వద్ద మరో షెడ్ నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయం పక్కన పోలీసు కార్యాలయానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సమీకృత కలెక్టరేట్ ప్రక్కన స్థలం కేటాయించామని టెండర్ ప్రక్రియ పూర్తయిందని త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగుల కోసం సఖి సెంటర్ పక్కన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే ప్రాంతంలో రూ.1.4 ఓట్లతో చైల్డ్ హోమ్ ను కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు భరోసా సెంటర్ ను కూడా ఇక్కడే నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థుల కోసం గ్రూప్స్ లో శిక్షణ పొందేందుకు ఐటిడిఎ ద్వారా ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ కేంద్రాలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు.

శిక్షణ కేంద్రాలలో శిక్షణ పొందిన 98 శాతం అభ్యర్థులు సక్సెస్ రేట్ ను సాధించారన్నారు. మన ఊరు మనబడి పథకం కింద 125 ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. 50 కోట్లను విడుదల చేసిందని ఈ పనులన్నీ త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ ఎంపిక చేసి అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు.

వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను ముందస్తుగానే పూర్తి చేయుటకు ప్రణాళికలు రూపొందించమన్నారు. గట్టమ్మ దేవాలయం నుండి జరుగుతున్న ఎన్ హెచ్ విస్తరణ పనులను వర్షాకాలంలోపే పూర్తయ్యేట్లు చూస్తామన్నారు. ఎన్ హెచ్ అధికారులను సమన్వయం చేసుకొని ట్రాఫిక్ రద్దీగా ఉండే గ్రామాలలో అండర్పాస్ నిర్మాణాలతో పాటు జిల్లా కేంద్రం తో పాటు పెద్ద గ్రామాలలో ఫుడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.

జంగాలపల్లి నుండి గాంధీనగర్, ఎటురునాగారం నుండి భద్రాచలం వెళ్లే రహదారులను జాతీయ రహదారులుగా మార్చే అవకాశం ఉందన్నారు.  జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టి వెంకటాపురం నూగురు మండలం బిసి మరి గూడెం, ఏటూరునాగారం ములుగు జిల్లా కేంద్రంలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సత్యం న్యూస్ ములుగు జిల్లా ప్రతినిధి

Related posts

బెదిరింపుల నేపథ్యంలో కారుకు బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు

Satyam NEWS

గ్రీవెన్స్ సెల్ నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌కు జిల్లా ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ “క్లాసు”….!

Satyam NEWS

డిప్యూటీ సీఎం కళత్తూరు కలలు కనడం మానేయాలి

Satyam NEWS

Leave a Comment