హరిత హారం ఎందుకు? ఎందుకేమిటి అయినా ఇదేం ప్రశ్న… తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని అందచేయడానికి చేసే ప్రయత్నం. మొక్కలు పెంచితే పర్యావరణం బాగవుతుంది….
చాలా హరిత హారం గురించి ఇంకా చెప్పాలా? మరి ఇదేమిటి? గంట కింద నాటిన మొక్కలు కనిపించడం లేదు…. అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు కామారెడ్డి జిల్లా జుక్కల్ ప్రజలు. బాన్సువాడకు వెళ్లే రహదారి పక్కన గల కోర్టు ప్రహారీ గోడ పక్కన ఎంపీడీవో తో పాటు పంచాయతీ అధికారులు నేడు ఎంతో ఆర్భాటంగా మొక్కలు నాటారు.
శనివారం ఉదయం ఉపాధి కూలీలతో భారీగా మొక్కలు నాటించారు అధికారులు. నాటిన రెండు గంటల్లోపే మేకలు వాటిని మెసేశాయి. చుట్టూ కంచె ఏర్పాటు చేసినప్పటికీ మేకలు లోనికి వెళ్లి తినడం గమనార్హం. మేకలు తినడాన్ని గమనించిన పలువురు నివ్వెరపోయారు.
ప్రస్తుతం ఒక్క మొక్క కూడా కనబడకుండా పోయింది. దీనిపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ నిర్లక్ష్య వైఖరి వీడి మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతలు కూడా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు…..
జి.లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్