30.2 C
Hyderabad
May 17, 2024 15: 13 PM
Slider విజయనగరం

మంత్రి పదవి నాకు వద్దు… ఎమ్మెల్యేగానే ఉండిపోతా…!

#mlakolagatla

తాను మంత్రి ప‌దవి కోరుకో లేదని…..మ‌ళ్లీ ఎమ్మెల్యే గానే పోటీ చేస్తాన‌ని..! మంత్రి ప‌ద‌వి ఇస్తే…రాష్ట్రం మొత్తం తిర‌గాలని.. కానీ నియోజ‌క వర్గ ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతారని అన్నారు…ఉత్త‌రాంధ్ర వైఎస్ఆర్సీపీ క‌న్వీన‌ర్, విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి.

ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం లో  త‌న నివాసంలో ఆయ‌న మాట్లాడుతూ. రాష్ట్ర మంత్రి వర్గ రేసులో తాను లేనని, అనవసర ప్రకటనలు నమ్మవద్దని  ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సీఎం జ‌గ‌న్  పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజారంజక పాలన అందిస్తున్నారని…. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడతామని ముందుగానే చెప్పారన్నారు.

అన్నమాట ప్రకారం ప్రస్తుతం జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించడం లేదని, తాను కోరుకోలేద‌ని ఈ  విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. జిల్లాలో సామాజిక సమీకరణాల ప్రాతిపదికన మంత్రి పదవులు లభిస్తాయన్న విషయాన్ని గ్రహించాలన్నారు.

తాను మంత్రి పదవి రేసులో లేనని అదే పరిస్థితుల్లో మంత్రి పదవి పట్ల అంత ఆసక్తి  కూడా లేనట్లు చెప్పారు. ఎందుకంటే నగరాభివృద్ధే తన ధ్యేయమని, రానున్న రోజుల్లో ప్రజా సహకారంతో శాసన సభ్యుడిగా ఎన్నికై సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ముందస్తు ప్రణాళికలతో వెళ్తున్నామన్నారు.

మంత్రి పదవి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు, కార్యక్రమాలు ఉండే నేపథ్యంలో నగరాభివృద్ధి పై దృష్టి పెట్టడం కష్టమవుతుందన్న విషయాన్ని ఉటంకించారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి రేసులో ఉన్నట్లు సోషల్ మీడియాలో మరియు ఛానల్స్ లో వస్తున్న స్క్రోలింగ్ తనకు ఇబ్బందిగా మారనున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో  26 జిల్లాలు గా ఏర్పడి, పాలన వికేంద్రీకరణ జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలకు మరింత మెరుగైన సుపరిపాలన అందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. రానున్న రెండున్నరేళ్ల లో మరింత మెరుగైన పాలన అందనుందని అన్నారు. 

ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎం జ‌గ‌న్  నేతృత్వంలో తామంతా ఎమ్మెల్యేలుగాఆ ఉండడం సంతోషంగా ఉందన్నారు. నగరంలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందని అన్నారు. విద్యాపరంగా, మౌలిక సదుపాయాల పరంగా, తాగునీటి పరంగా అన్ని. విధాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ప్రధాన జంక్షన్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

పెట్రో ధరపై నరసరావుపేటలో ఎంఐఎం వినూత్న నిరసన

Satyam NEWS

ఈ నెల 25వ తేదీన విజయనగరం కు సీఎం జగన్…!

Satyam NEWS

లాఠీ పట్టాల్సిన ఖాకీల చేతులు.. మానవత్వాన్ని పట్టుకున్నాయి..!

Satyam NEWS

Leave a Comment