28.2 C
Hyderabad
May 17, 2024 13: 32 PM
Slider జాతీయం

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా

అంతర్జాతీయ విమానాలను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్‌ వేరియెంట్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో విమానాలను అనుకున్న ప్రకారం నడపకూడదని డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నిర్ణయించింది.

విమానాల రాకపోకలకు సంబంధించిన కొత్త తేదీపై నిర్ణయం తీసుకోలేదు. కోవిడ్‌ నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కేంద్రం రద్దు చేసింది. ఈనెల 15 నుంచి పునరుద్ధరించాలని గత నెల 26న నిర్ణయించింది.

తర్వాత ఒమిక్రాన్‌ కలకలం రేగడంతో పునరుద్ధరణను వాయిదావేసింది. దేశంలో ఈ కేసులు లేకున్నా గట్టి చర్యలు తీసుకుంటోంది.

Related posts

చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఈ నెల 21 కి వాయిదా

Satyam NEWS

మాక్లూర్ సంఘటన ఖండించిన ఆర్మూర్ ఎమ్యెల్యే జీవన్ రెడ్డి

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణంలో విగ్రహాలు తొలగింపులో ఉద్రిక్తత

Satyam NEWS

Leave a Comment