40.2 C
Hyderabad
May 6, 2024 18: 07 PM
Slider ప్రత్యేకం

హుజూర్ నగర్ పట్టణంలో విగ్రహాలు తొలగింపులో ఉద్రిక్తత

#uttamkumarreddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా సెంటర్లో భారతదేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఎటువంటి సమాచారం లేకుండా తొలగిస్తున్నారన్న సమాచారం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరా సెంటర్ కు భారీగా చేరుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా విగ్రహాలను ఎలా తొలగిస్తారని అధికారులతో పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. అప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల నుండి పోలీసులను రప్పించి కట్టు దిట్టమైన ఏర్పాట్లను చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు విగ్రహాలను తొలిగించే ప్రసక్తి లేదని అడ్డుకుని, రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

విగ్రహాల తొలగింపును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను,కార్యకర్తల ను పోలీసులు అరెస్టు చేసి,ఆందోళన కారులను బలవంతంగా డి.సి.యం వ్యాన్ లో ఎక్కించి మేళ్ళచెరువు, గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కు, తరలించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు,మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ చేరుకున్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గత 40 సంవత్సరాలుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను అక్రమంగా కూల్చివేతను నిరసిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్,ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,పిసిసి జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా,పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు,మున్సిపల్ కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,కస్తాల శ్రవణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి దీక్ష చేపట్టటంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. దీక్ష ప్రాంగణంలో భారీగా పోలీసులు మోహరించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ & బి డి.ఈ,స్థానిక యస్.ఐ లు ఎటువంటి సమాచారం లేకుండా విగ్రహాలను కూల్చి వేయించిన అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

కార్యకర్తలు,నాయకులు,పార్టీ అభిమానులు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. సుమారు 5 గంటల పాటు జరిగిన దీక్షలో చివరకు అధికారులు దిగివచ్చి విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి ఇస్తాం అని తెలపడంతో ఉత్తమ్ తన దీక్షను విరమించారు.దీనితో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,భారీ సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గత ఐదేళ్ల అవినీతి, భూకబ్జా పై విచారణ

Satyam NEWS

బోథ్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Satyam NEWS

దమ్ము లేని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కును కాపాడగలవా….?

Satyam NEWS

Leave a Comment