29.7 C
Hyderabad
May 2, 2024 05: 28 AM
Slider ఖమ్మం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

#Cultural programs

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబించే విధంగా కలారూపాలు….తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు లకారం ట్యాంక్‌బండ్‌పై జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్దులను చేశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 21 రోజుల పాటు నిర్వహించే

దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు, ఇందు ప్రదర్శించిన కూచుపూడి నృత్యం, మస్తాన్‌ ప్రదర్శించిన వీధి గారడి స్ట్రీట్‌ మ్యాజిక్‌, మహిమ్‌ చే వెస్టన్‌ నృత్యం, వీరెందర్‌ ప్రదర్శించిన జానపద నృత్యం, హమ్మెద్‌, కావ్య, శోభిక, సింధు, దేవెందర్‌ లు

ప్రదర్శించిన పూనకాలు లోడిరగ్‌ మెడ్‌లీ నృత్యం, మాస్టర్‌ మోహన్‌ చే శాస్త్రీయ, పాశ్చాత్య, జానపద సమ్మిలిత నృత్యం, హమ్మెద్‌, కావ్య, శోభిక, దేవెందర్‌ల రాములో రాములు నృత్యం, మోహన్‌, కావ్యలు ప్రదర్శించిన డ్యూయట్‌ సాంగ్‌, ఇందు జానపద నృత్యం, స్నేహ అంకిత హవ్‌యూ లైక్‌ ఇట్‌`కె.పిఓపి నృత్యం, యస్‌.కె.జోయా చే బుల్లెట్‌ బండి సాంగ్‌, హాసిని,

ప్రణవి, సంధ్యలు చేసిన గ్రూప్‌ జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆహుతులను అలరింప చేశాయి. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్‌ చక్రవర్తి, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ స్వామి, స్థానిక కార్పోరేటర్‌ కర్నాటి కృష్ణ, పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు.

Related posts

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి రాజీనామా చేయాలి

Satyam NEWS

మహనీయులను స్మరించుకుంటే మనకు నిత్యస్ఫూర్తి

Satyam NEWS

దీపావళి గజల్

Satyam NEWS

Leave a Comment