28.2 C
Hyderabad
May 17, 2024 12: 02 PM
Slider ముఖ్యంశాలు

సొంత ఖర్చుతో బోరు మోటార్ వేయించిన ఎమ్మెల్యే కాలేరు

కాచిగూడ డివిజన్ కాశిరాం జీరా లైన్లోని బసంత్ కాలనీలో ఉన్న బోరు మోటర్ పాడైపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని బస్తీ వాసులు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ దృష్టికి తీసుకురాగా, వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బోర్ మోటర్ ఏర్పాటు చేయిస్తానని హామీఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎమ్మెల్యే వారి సొంత ఖర్చుతో బసంత్ కాలనీలో కొత్త బోరు మోటరు ఏర్పాటు చేశారు.
అడిగిన వెంటనే స్పందించి సొంత ఖర్చుతో బోరు మోటరు వేయించినందుకు బస్తీ వాసులు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాచిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భీష్మ దేవ్ బోరు మోటరు పనులను దగ్గరుండి చేయించారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

స్టీల్ ప్లాంట్ పై కేసీఆర్ దెబ్బకు దిగివచ్చిన కేంద్రం

Satyam NEWS

మానవత్వానికి అర్ధం చెప్పిన మహిళా ఎస్ ఐ శిరీష

Satyam NEWS

కలుషిత నీటితో నిండిపోయిన ఏలూరు కాల్వ

Satyam NEWS

Leave a Comment