27.7 C
Hyderabad
May 4, 2024 09: 13 AM
Slider ముఖ్యంశాలు

కలుషిత నీటితో నిండిపోయిన ఏలూరు కాల్వ

#elurucanal

ఏలూరు కాలువలో కలుషిత నీరు పారుతున్న విషయాన్ని నీటి పారుదల శాఖాధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ఏలూరు కాలువ ద్వారా కలుషిత కెమికల్ నీరు కొల్లేరు ప్రాంతాలకు కూడా సప్లై చానల్స్ చేరుకుంటున్నదనే విషయంపై కూడా ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కలుషిత నీరు ఏలూరు కాలువలోకి విడుదల చేసే ది పరిశ్రమ లా లేక ఎవరైనా వ్యక్తులా అనేది విచారణ జరపాల్సి ఉంది.

ఏలూరు కాలువ లోని కలుషిత నీరు పంట పొలాలకు వెళ్లితే పంటలు తెగుళ్లు బారిన పడి రైతులు నష్టాల బారిన పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా సారవంతమైన నేలలు కాస్త నిస్సారవంత మైన నేలలు గా మారే ప్రమాదం ఉందని ఏలూరు కాలువ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. పశువులు ఈ నీరు తాగితే ఉదరకోశ, గర్భకోశ వ్యాధులు ప్రబలి పశువులు ప్రాణాలుకూడా కోల్పోయే ప్రమాదం లేక పోలేదని పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఆక్వా సాగుకూడా సర్వ నాసనమైపోతుందని చేపల సాగుదారులు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దెందులూరు పర్యటనకు వచ్చినప్పుడు దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి ఏలూరు కాలువ ను ఆధునీకరించి డెల్టా ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందించాలని కోరారు. కొల్లేరుకు కూడా రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని కోరిన విషయం తెలిసిందే.

Related posts

వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి

Satyam NEWS

భారీ వర్షాలతో హిమాచల్‌ అతలాకుతలం

Bhavani

రైతులను సంఘటితం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రయత్నం

Satyam NEWS

Leave a Comment