Slider నిజామాబాద్

ప్రైవేట్ ఆస్పత్రిలో మూడేళ్ళ చిన్నారి మృతి

నేషనల్ డాక్టర్స్ డే రోజునే కామారెడ్డిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ మూడేళ్ళ చిన్నారి మృతి చెందింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన హార్థిక, రమేష్ లకు ఏకైక కూతురు మనుశ్రీ జ్వరం, విరోచనాలతో బాధ పడుతోంది. గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద చూపించినప్పటికి తగ్గక పోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంగా పిల్లల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు వైద్య పరీక్షలు చేస్తుండగా మనుశ్రీకి ఫిట్స్ వచ్చింది. అనంతరం చికిత్స పొందుతూ మనుశ్రీ మృతి చెందింది. అయితే మనుశ్రీకి స్థాయికి మించి డోస్ ఇవ్వడంతోనే ఫిట్స్ వచ్చిందని, మృతికి వైద్యులే కారణమంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. డాక్టర్లకు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హాస్పిటల్ కు కామారెడ్డి టౌన్ సిఐ నరేష్ బందోబస్తుతో చేరుకొని కుటుంబ సభ్యులను సముదాయించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చిన్నారి మృతి చెందిందని, కేవలం గంటలోపు మితిమీరిన డోస్ ఇవ్వడం వల్లనే చిన్నారి మనుశ్రీ మృతి చెందింది అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ చిన్నారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

ఫిట్స్ తో చిన్నారి మృతి -ఆస్పత్రి వైద్యులు వెంకటేశ్వర్ గౌడ్

అన్నారం గ్రామానికి చెందిన మనుశ్రీ అనే మూడేళ్ళ చిన్నారిని ఉదయం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పాపను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని విరోచనాలు తగ్గేలా ఇంజక్షన్స్ ఇచ్చాం. కాసేపటికి తగ్గి పాప నార్మల్ గానే ఉంది. ఇతర పిల్లలను చూసి వచ్చేసరికి మరోసారి ఫిట్స్ వచ్చి పాప చనిపోయింది. అధిక డోస్ ఇవ్వడం వల్లనే చిన్నారి మృతి చెందింది అనేది అబద్ధం. ఫిట్స్ తోనే పాప మృతి చెందింది. ఇందులో మా నిర్లక్ష్యం ఏమీలేదు.

Related posts

వదల బొమ్మాళీ: కౌన్సిల్ రద్దుపై కేంద్రమంత్రికి రఘురామ లేఖ

Satyam NEWS

తొలి తరం కమ్యూనిస్టు యోధుడు కె.యల్‌

Murali Krishna

గీతాంజలి సినిమాతో పోల్చడం హ్యాపీ గా ఉంది: తమన్నా

Bhavani

Leave a Comment