31.7 C
Hyderabad
May 7, 2024 01: 50 AM
Slider గుంటూరు

స్టీల్ ప్లాంట్ పై కేసీఆర్ దెబ్బకు దిగివచ్చిన కేంద్రం

#kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకే ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ విషయం లో కేంద్రం దిగివచ్చిందని ఏపీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.తోట చంద్రశేఖర్ అన్నారు. ఇది ఏపీ లో BRS పార్టీ తొలి విజయం. కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, ఒక అధ్యయన బృందాన్ని పంపారు. స్టీల్ ప్లాంట్ పై ఏపీలో టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తేసాయి. AP ప్రజలకి అండగా నిలబడ్డది BRS పార్టీ నే అని ఆయన అన్నారు.

‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంటును సాధించుకుందాం. ఉక్కు ఉద్యమంలో 32 మంది అసువులు బాసారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ రూ.3 లక్షల కోట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది జీవిస్తున్నారు. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను కేసీఆర్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారని తోట వెల్లడించారు.

జాతి సంపదను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం మొండివైఖరితో ప్రైవేటీకరణ చేసినా…. మళ్ళీ దాన్ని కాపాడుకొని, జాతీయo చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల 3 రోజుల పాటు విశాఖలో పర్యటించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరుపున పోరాటం చేశాం.. వారికి అండగా నిలబడ్డాం. BRS దెబ్బకే… కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఇవాళ విశాఖపట్నం లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదు… బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని ప్రకటించారని తోట అన్నారు.

బైలడిల్లా గనులను అదానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెంటనే గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఆదేశాలతో కేంద్రం మెడలు వంచి, ఇవాళ కేంద్రప్రభుత్వ ఉక్కు సహాయ మంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించగలిగాం. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ ను ప్రైవేటీకరించమని వెంటనే కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.

RINL కు సొంత గనులు కేటాయించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సంబంధించిన 20 వేల ఎకరాల భూములను రాష్ట్రపతి పేరు మీద పెట్టుకున్నారు. దాన్ని వెంటనే RINL మీద ట్రాన్స్ఫర్ చేయాలి. RINL కు రూ.5 వేల కోట్లు తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంతకాళ్ళ మీద నిలబడేలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ కు ఆర్థికసాయం, వైజాగ్ రైల్వే జోన్, వైజాగ్ మెట్రో, దుగరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ సహా విభన హామీలను నేటికీ నెరవేర్చలేదు అని ఆయన అన్నారు.

Related posts

ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ భూమిని కబ్జా

Bhavani

ఎక్సోడస్: పరిపాలనా బాధ్యతలు విశాఖపట్నం నుంచే

Satyam NEWS

తప్పుడు మ్యాప్ తో మళ్లీ రెచ్చగొడుతున్న చైనా

Bhavani

Leave a Comment