24.7 C
Hyderabad
May 17, 2024 02: 43 AM
Slider వరంగల్

ఈ విజయం కష్టించి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అంకితం

#KusumaJagadeesh

ప్రజాదరణతోనే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకుని విజయం సాధించడం జరిగిందని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఈ రోజు మొదటగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్బంగా అమ్మవారికి స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడి నుండి ఆయన ములుగు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో 150 ద్విచక్ర వాహనాలతో  ఏర్పాటుచేసిన భారీ విజయోత్సవ ర్యాలీలో జడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో జడ్పీ చైర్మన్ విజయోత్సవ సంబరాల్లో భాగంగా జాతీయ రహాదారిపై బాణాసంచా పేల్చారు. 

ఈ ర్యాలీ అనంతరం ఆయన ములుగు జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మొదట నియోజక వర్గంలోని పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ విజయం నియోజక వర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అంకితమని, ఎన్నిక విపక్షాలకు ఒక మంచి గుణపాఠాన్ని చెప్పిందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పట్టభద్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో సమిష్టితత్వానికి ఇది ఒక నిదర్శమని రాబోవు రోజులలో కూడా ఇదే ఐక్యతను పార్టీ శ్రేణులు ప్రదర్శించాలన్నారు.

వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఎక్కడ జరుగనన్ని ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశాలు కేవలం ములుగు నియోజక వర్గంలో మాత్రమే జరిగాయన్నారు. ఎంతో మంది కార్యకర్తలు నిస్వార్థంగా ఈ ఎన్నిక కోసం కృషి చేశారన్నారు. పార్టీ శ్రేణులు నిరంతరం బాధ్యాతాయుతంగా ఉండాలని జిల్లాలో అధికారులు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్థానిక ప్రజా ప్రతినిధుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన , ప్రజల కోసం వారు పాటు పడే క్రమంలో స్పందించకపోయిన అధికారుల పట్ల ఇక నుండి నిర్దాక్షణ్యంగా వ్యవహరిస్తామని, ప్రజలకు, పార్టీ శ్రేణులకు తాను ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, వెంకటాపూర్ మండల అధ్యక్షులు కూరెల్లి రామాచారి, గోవిందరావుపేట మండల అధ్యక్షులు మురహరి బిక్షపతి, రైతు బందు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య,  మేడారం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ ఆలెం రామ్మూర్తి, సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్, గై అశోక్,  ఎంపిటిపిల జిల్లా ఫోరం అధ్యక్షుడు పోరిక విజయరామ్ నాయక్, మైనార్టీ జిల్లా నాయకుడు తాహేర్ పాషా, ముడుతనపల్లి మోహన్, శీలం మధు, మంద రవి, నర్సాపూర్ పిఎసిఎస్  చైర్మన్ మాడుగుల భద్రయ్య, చంటి భద్రయ్య, బుర్ర సమ్మయ్య, రమేష్ రెడ్డి, పేరుక కోటేశ్వర్ రావు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

మొక్కలు నాటిన సినీ నటి హేమల్

Satyam NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిది

Satyam NEWS

తెలంగాణ లో కొత్తదేవుడు ఇప్పుడు కేసీఆర్

Satyam NEWS

Leave a Comment