30.2 C
Hyderabad
May 17, 2024 14: 43 PM
Slider ప్రత్యేకం

నెవర్ ఎండింగ్ డైలమో: ఎంత పని చేశావు భవానీ

#Aadireddy Bhavani

తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు ఆదిరెడ్డి భవాని చేసిన ఒక్క చిన్నపనికి తెలుగుదేశం పార్టీ మొత్తం ఇప్పుడు డిఫెన్సులో పడిపోయింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను మాట మాత్రం కూడా అనలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సంజాయిషీ నోటీసులు కూడా ఇవ్వలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది.

దేశవ్యాప్తంగా జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ సభ్యులు ఎన్నుకోవాల్సిన ఈ కోటా నుంచి పూర్తి బలం ఉన్న వైసీపీ నలుగురు అభ్యర్ధులను రంగంలో దించగా పూర్తి బలం లేని తెలుగుదేశం పార్టీ కూడా ఒక అభ్యర్ధిని రంగంలో దించింది.

అసెంబ్లీలో 23 స్థానాలు ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అనధికారికంగా పార్టీ ఫిరాయించారు. అంటే మిగిలిన ఓట్లు 20. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్ధికి 20 ఓట్లు రావాలి. ఈ 20లో ఒకరు అనారోగ్య కారణాలతో, అరెస్టులో ఉండటం వల్ల మరొకరు ఓటు వేయలేదు.

అనధికారికంగా పార్టీ ఫిరాయించిన వారిని ఏదోక విధంగా కార్నర్ చేద్దామని అనుకున్న తెలుగుదేశం పార్టీ, రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లో పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని విప్ జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ కన్నా రెండాకులు ఎక్కువ చదివిన వైసీపీ సిద్ధాంత కర్తలు తెలుగుదేశానికే ఓటు వేసేలాగా అయితే అవి చెల్లకుండా పోయేలా కొత్త ఫార్ములా కనిపెట్టారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు కావాలని పొరబాటు చేసి తమ ఓట్లు చెల్లకుండా చేసుకున్నారు. అయితే 18 ఓట్లు రావాల్సిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి 17 వచ్చాయి. తగ్గిన ఓటు ఎవరిది అని లెక్కేసుకుంటే అది ఆదిరెడ్డి భావాని ఓటుగా తేలింది. ఆమె కూడా చెల్లని ఓటు వేసింది. ఎందుకు వేసింది అనేది చర్చనీయాంశం అయింది.

తనకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడైన బాబాయి అచ్చెన్నాయుడు ఏసీబీ కేసులో అరెస్టు అయి ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు వత్తిడి తీసుకువచ్చి ఆమెతో చెల్లని ఓటు వేయించారా అనేది ఒక అనుమానం. లేదూ బాబాయికి ఎక్కువ డ్యామేజీ జరగకుండా చూడండి అంటూ ఆమే అధికార పార్టీకి సిగ్నల్ పంపారా అనేది మరో అనుమానం.

ఏది ఏమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు విప్ ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేద్దామనుకున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆదిరెడ్డి భవాని చేసిన చర్యతో అటు మింగలేక కక్కలేని విధంగా తయారైంది. తెలుగుదేశం పార్టీ నోటీసులు జారీ చేయాలంటే ఆదిరెడ్డి భవానికి కూడా ఇప్పుడు నోటీసు ఇవ్వాలి. ఊరుకుంటే మిగిలిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు సేఫ్. అదీ పరిస్థితి.

Related posts

రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు వాయిదా

Satyam NEWS

వైభవంగా నల్లకుంట గణేష్ నిమజ్జన కార్యక్రమం

Satyam NEWS

కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment