38.2 C
Hyderabad
May 2, 2024 21: 59 PM
Slider సంపాదకీయం

ఎనదర్ బ్లో: ఏపి ప్రభుత్వంపై మరో కోర్టు ధిక్కార నేరం?

ramesh kumar

సుప్రీంకోర్టు, హైకోర్టు చేతుల్లో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరో కోర్టు ధిక్కారనేరం కేసు ఫైల్ కాబోతున్నదా? ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చేసిన ట్వీట్ చూస్తే ఈ అనుమానం నిజమనే అనిపిస్తున్నది.

తన నియామకం విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ మేరకు కోర్టు ధిక్కార నేరం కేసు దాఖలు చేయబోతున్నట్లుగా రవిశంకర్ చేసిన ట్వీట్ చూస్తే అర్ధం అవుతుంది. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలను రేపటి లోపున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా? లేక కోర్టు ధిక్కార నేరం కేసు ఎదుర్కొనబోతున్నదా అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఎన్నికల కమిషనర్ పదవిని కుదించి రమేష్ కుమార్ ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దానిపై ఆయన హైకోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఇచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు నిర్ద్వందంగా కొట్టేసింది. అలాగే కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమిస్తూ ఇచ్చిన జీవోలను కూడా సస్పెండ్ చేసింది.

దీంతో రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం రమేష్ కుమార్ నియామకపు సర్కులర్ ని ఏకపక్షంగా రద్దు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా అడ్వకేట్ జనరల్ తో ప్రెస్ కాన్షరెన్సు పెట్టించి కొత్త వాదన వినిపించింది.

హైకోర్టు రమేష్ కుమార్ ని నియమిస్తూ ఆదేశాలు ఇవ్వలేదని చెప్పింది. కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం కుదరదు అని చెప్పిన కోర్టు, అదే నిబంధనలు ప్రకారం ఎన్నికైన నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు అని ప్రభుత్వం, హైకోర్టు తీర్పు పై తమ అభిప్రాయం చెప్పింది.

అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలి అంటూ, సుప్రీం కోర్టుకు కూడా ప్రభుత్వం వెళ్ళింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం, స్టే ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తీవ్ర అడ్డంకులు కల్పిస్తున్నందున కోర్టు ధిక్కార పిటిషన్ వెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ప్రభుత్వం పైనా, చీఫ్ సెక్రటరీ పైనా, ఆయన రేపు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అంటూ, సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేసారు. రేపటి లోగా, ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తుందా అంటూ, జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేసారు. దీంతో, ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఏమి చెప్తుంది ? కోర్టు ధిక్కరణ కింద భావిస్తుందా అనేది చూడాలి.

Related posts

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

Satyam NEWS

ఈ సారు ఇక్కడ అధికారి కాదు ఈ ప్రాంతానికి మహారాజు

Satyam NEWS

వ్యర్ధాలపై విజ‌య‌న‌గ‌రంలో అవ‌గాహ‌న‌ ర్యాలీ

Sub Editor

Leave a Comment