39.2 C
Hyderabad
May 3, 2024 12: 20 PM
Slider ముఖ్యంశాలు

రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు వాయిదా

#Y S Jaganmohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులను కేంద్ర పర్యావరణ శాఖ వాయిదా వేసింది.

ఆరు అంశాలపై కేంద్ర పర్యావరణ మదింపు శాఖ రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఎన్జీటీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వాలని కూడా ఏపీని ఆదేశించింది.

ప్రాజెక్ట్ స్పష్టమైన డ్రాయింగ్స్, లేఅవుట్‌లు, చార్ట్‌లను ఇవ్వాలని సూచించింది. స్థల సేకరణ, ఆయకట్టు వివరాలనూ కేంద్రం కోరింది.

గతంలో ఇచ్చిన అనుమతులకు కోరిన సవరణపై ఏపీకి స్పష్టత లేదని వెల్లడించింది. గతంలో ఇచ్చిన తెలుగుగంగ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన అనుమతులలో ఏపీ సవరణ కోరింది.

ఏపీ దరఖాస్తులో స్పష్టత కొరవడిందని పర్యావరణ మదింపు శాఖ పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎంత నీటిని వాడుకోవాలనుకున్నది స్పష్టం చేయాలని కేంద్రం పేర్కొంది.

Related posts

నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

Satyam NEWS

గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS

గుడ్ డెసిషన్: పౌల్ట్రీ ఫారం యాజమాన్యాల ఔదార్యం

Satyam NEWS

Leave a Comment