28.2 C
Hyderabad
May 17, 2024 10: 49 AM
Slider మహబూబ్ నగర్

ఓపెన్ టాక్: మా పిల్లలకు ఆన్ లైన్ విద్య వద్దు

#Kollapur Schools

ఆన్ లైన్ బోధన తమ పిల్లలకు సరిపోదని 90 శాతం మంది పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్/ఆఫ్లైన్ తరగతుల నిర్వహణ, పాఠశాలల పున:ప్రారంభం పై కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.

ఈ సర్వేలో తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారు. ఇందులో  భాగంగా 90శాతం మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తెరవాలని, ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు భోధన సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించి కరోనా జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలో బోధన కొనసాగించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.నారాయణ, మండల అద్యక్షులు శంకర్ నాయక్, పెద్దకొత్తపల్లి మండల ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు, పెంట్లవెల్లి మండల అద్యక్ష కార్యదర్శులు రాజేష్,రమేష్, మండల నాయకులు సలీం, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీతక్క సూటి ప్రశ్నలు

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం

Satyam NEWS

చైనా టిక్ టాక్ కు చిచ్చుపెట్టిన ఇండియా చింగారి

Satyam NEWS

Leave a Comment