32.2 C
Hyderabad
May 12, 2024 21: 00 PM
Slider ముఖ్యంశాలు

చైనా టిక్ టాక్ కు చిచ్చుపెట్టిన ఇండియా చింగారి

#Chingari App

చైనా వస్తువులను బ్యాన్ చేయాలనే నినాదం దేశమంతటా మారుమోగి పోతుంటే కొందరు మాత్రం టిక్ టాక్ యాప్ మోజులో పడి దాన్ని వదల్లేక పోతున్నారు. మిగతా యాప్ లకు ప్రత్యామ్నాయం ఉంది కానీ టిక్ టాక్ కు మాత్రం ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. దాంతో మనదేశంలో టిక్ టాక్ ఆప్ కు డిమాండ్ పెరిగిపోతూనే ఉంది. ఇంకా 70 శాతం మంది టిక్ టాక్ యాప్ నే మన దేశంలో వాడుతున్నారు.

ఇలాంటి వారిని ఆకట్టుకోవడానికి భారత్ నుంచే ఒక యాప్ వచ్చేసింది. రావటమే కాదు వచ్చిన కొద్ది గంటల్లోనే ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. లక్షల డౌన్లోడ్ తో టిక్ టాక్ మతి పోగొడుతుంది. మన భారతీయుడు తయారుచేసిన ఆ యాప్ పేరు చింగారి.

ఈ చింగారి యాప్ ను కేవలం 72 గంటల్లోనే 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్స్ పెరుగుతుండడంతో సింగారి యాప్ గూగుల్ లో ట్రెండింగ్ లో ఉంది. ప్లే స్టోర్ లో ఒకటో స్థానం లో నిలిచింది. చైనా కిరాతక సైన్యంతో గ్యాల్వాన్  లోయ ఘర్షణ తర్వాత చైనాపై భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు.

చైనా ఉత్పత్తులకు దేశంలో స్థానం లేకుండా చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఉదర కొట్టేస్తున్నారు. చింగారి యాప్ కు ఇంత ఆదరణ లభిస్తుందని తాము ఊహించలేకపోయామని అంటున్నారు యాప్ డెవలపర్ విశ్వాత్మ నాయక్. టిక్ టాక్ కు భిన్నమైన మరిన్ని మంచి ఫీచర్లతో సింగారి యాప్ రూపొందించామని వారు చెప్పారు.

ఈ యాప్ లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎవరి వీడియోలు వైరల్ అవుతాయో వారికి పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లను డబ్బులుగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ, బంగ్లా, పంజాబీ కన్నడ తమిళ మలయాళ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు సింగారి యాప్ నిర్వాహకులు తెలిపారు.

Related posts

కేంద్రమా నీకెందుకు ఇంత ఉలికిపాటు?

Satyam NEWS

విశాఖ కేజీహెచ్‌లో వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్‌

Satyam NEWS

గోదావరి తీర గ్రామాలకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment