37.2 C
Hyderabad
May 6, 2024 13: 05 PM
Slider వరంగల్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీతక్క సూటి ప్రశ్నలు

#MLASeetakka

కరోనా సమయంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ సీతక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు. కరోనా సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయివేటు ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే కాకుండా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖ టీఆర్ఎస్ నాయకులు అందరూ ప్రయివేటు ఆసుపత్రులకే వెళ్లారని సీతక్క అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉంటే వీరంతా ప్రయివేటు ఆసుపత్రులకు ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే సీతక్క కొన్ని ప్రశ్నలు సంధించారు. అవి:

రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్లో సిటీ స్కాన్ లా సౌలభ్యాలు ఉన్నాయి?

ప్రైవేట్ హాస్పిటల్ లు వద్దు ప్రభుత్వ హాస్పిటల్ ముద్దు అన్న ముఖ్యమంత్రి కరోనా వస్తే మీరు ఎక్కడికి పోయారు?

మీ మంత్రులు, ఎమ్మెల్యేలు చికిత్స కోసం ఎక్కడకు పోయారు?

మీ మంత్రులు ప్రైవేట్ హాస్పిటల్ లలో చికిత్స ఎందుకు చేయించుకుంటున్నారు?

ఎన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి?

కరోనా మొదలయ్యి సంవత్సరన్నర అవుతుంది కనీసం ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలని ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా?

అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, ఉచిత వైద్యం మన హక్కు అది సాధించుకుందాం.. అని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

Related posts

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్టు

Satyam NEWS

రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు

Satyam NEWS

వీధికుక్కల స్వైర విహారంతో మృత్యువాతపడ్డ గొర్రెలు

Satyam NEWS

Leave a Comment