30.2 C
Hyderabad
May 17, 2024 17: 44 PM
Slider ముఖ్యంశాలు

పాలకుర్తి-వల్మీడి-సన్నూరు టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ కావాలి

#Palakurthi

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి గొప్పగా జరుగుతోందని, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడానికి, అభివృద్ది చెందిన దేవాలయాల నిర్వహణ, పరిరక్షణ నిరంతరం కొనసాగేందుకు వీలుగా పాలకుర్తి నియోజకవర్గంలోని విశిష్ట ప్రాచీన దేవాలయాలతో పాలకుర్తి-వల్మీడి-సన్నూరు టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ పాలకుర్తి నియోజక వర్గ ముఖ్యులు కోడూరు నరసింహ్మరెడ్డి, కుందూరు సాయిరామిరెడ్డి, కుందూరు కృష్ణచైతన్య రెడ్డి, రామసాయం కిషోర్ రెడ్డి, కుందూరు రాజేశ్ రెడ్డి తదితరులు నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో కలిసి విజ్ణప్తి చేశారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజక వర్గంలో దేవాలయాల అభివృద్ధి, దేవస్థానాల చారిత్రక పున:వైభవం గొప్పగా కొనసాగుతున్నాయన్నారు. ఫలితంగా గతించిన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రస్తుతం పరిఢవిల్లుతున్నాయన్నారు. పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహ్మ స్వామి ఆలయం తెలుగులో మొదటి గద్య రచయిత, ఆది కవి పాల్కురికి సోమనాధుని పేరుమీద ప్రఖ్యాతి గాంచిందన్నారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయక్షేత్రం భాగవతాన్ని రచించిన మహాకవి బమ్మెర పోతన జన్మస్థలం కావడం విశేషమన్నారు.

హైదరాబాద్ కు 110 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఆలయం శివుడు, లక్ష్మీ నరసింహ్మ స్వామి కొలువుదీరిన పవిత్ర దేవస్థానమని, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 20 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, సోమేశ్వర లక్ష్మీ నరసింహ్మస్వామి దేవాలయంలో వసతుల కల్పన, బమ్మెర పోతన స్మారక మందిరం, బాసర తరహాలో అక్షరాభ్యాస మందిరం, పోతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తోందన్నారు.

కాకతీయుల కాలంలో నిర్మించి, వీధుల్లో వజ్ర, వైడూర్యాలు అమ్మిన ప్రాచీన ప్రాశస్త్యం ఉన్న పురాతన క్షేత్రం వల్మిడీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అత్యంత విశిష్టమైందన్నారు. తెలంగాణ వచ్చాక మంత్రి దయాకర్ రావు గారి చొరవతో సిఎం కేసిఆర్ గారు 10 కోట్ల రూపాయలు మంజూరు చేసి, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తురన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలంలోని సన్నూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. దాదాపు 85 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ అభివృద్ధి కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. విశిష్ట, ప్రాచీన దేవాలయాలకు పున:వైభవం తీసుకొచ్చేందుకు చేస్తున్న పనులు వేగవంతం చేయడానికి, భవిష్యత్ లో వీటిని నిరంతరాయంగా నిర్వహించి భక్తులకు సకల సదుపాయాలు కల్పించి, దేవాలయాలను పరిరక్షించేందుకు పాలకుర్తి-వల్మీడి-సన్నూరు టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుందని, దీనికోసం కృషి చేయాలని మంత్రిని పాలకుర్తి దేవాలయాల ముఖ్యులు నేడు కోరారు.

సత్సకల్పంతో చేస్తున్న పాలకుర్తి వాసుల కృషిని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, దేవాలయాల అభివృద్ధికి, ఈ ప్రాంత సంప్రదాయాలు, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చేస్తున్న కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఈ స్పూర్తి కోసం పనిచేస్తున్న పాలకుర్తి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటును సిఎం గారి దృష్టికి తీసుకెళ్లి, పని జరిగేటట్లు కృషి చేస్తానని హామి ఇచ్చారు.

Related posts

దశాబ్ది ఉత్సవాల్లోనైనా ఆదరించండి

Bhavani

రిజిగ్నేషన్: హిందువులను వేటాడి చంపినా మాట్లాడరా

Satyam NEWS

రోడ్ల విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలి

Satyam NEWS

Leave a Comment