39.2 C
Hyderabad
May 4, 2024 20: 10 PM
Slider వరంగల్

ఎక్కువ సంతానం ఉండొద్దన్న నిబంధన తొలగించండి

#ErrabelliDayakarRao

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉండొద్దు అన్న నిబంధనను తొలగించాలని కోరుతూ గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్(జీసిసి) మాజీ చైర్మన్ గాంధీ నాయక్ నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వినతిపత్రం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ నిబంధన ఉందని, మనకంటే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలు కూడా కాలేదని తన వినతిపత్రంలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని నిబంధన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండడం వల్ల ఇక్కడ స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలకు ఇది అడ్డంకిగా మారిందని తెలిపారు.

కొంతమందికి అనివార్య పరిస్థితుల్లో, అనుకోకుండా, అవగాహన లేకపోవడం వల్ల ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలుగుతోందని, దీనివల్ల వారు సమాజానికి రాజకీయాల ద్వారా సేవ చేయడానికి అనర్హులు కావడం విచారకరమన్నారు.

కాబట్టి దేశంలో ఎక్కడా లేని నిబంధన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నందున దీనిని వెంటనే తొలగించి, ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన తెలంగాణ ప్రజలు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అవకాశాలు కల్పించాలని కోరారు. జీసిసి మాజీ చైర్మన్ గాంధీ నాయక్ విజ్ణప్తి చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీనిని ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా మారి నేడు అధికారికంగా బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించనున్న సందర్భంగా మంత్రి గారికి గాంధీ నాయక్, పాలకుర్తి నియోజక వర్గ యువజన నాయకులు మేడారపు సుధాకర్, తదితరులు కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

ములుగు జిల్లాలో రైతు చట్టం వ్యతిరేక ఆందోళన

Satyam NEWS

మహిళలు, బాలల కోసం భరోసా కేంద్రం: ఎస్పీ సిందూశర్మ

Satyam NEWS

ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి

Bhavani

Leave a Comment