30.2 C
Hyderabad
May 17, 2024 19: 19 PM
Slider ప్రత్యేకం

ఏపిలో ఎటూ తేలని రాజకీయ లెక్కలు

Political calculations that do not go anywhere in AP

బీజేపీ ఏ పార్టీతో ఉంటే లాభం..ఏ పార్టీ తో ఉంటే నష్టం.. అదేనండి టీడీపీ తోనా..లేక వైకాపా తోనా.. ఒకసారి స్టోరీ లోకి వెళ్దాం ..వైకాపా ఎవరితోను మాకు పొత్తు అవసరం లేదు.. సింహం సింగిల్ గా వెళ్తుంది అని స్టేట్మెంట్ లు ఇచ్చేస్తుంది..కానీ సదరు అధినేత జగన్ గారు బహిరంగం గానే బీజేపీ తో మా బంధం రాజకీయలకు అతీతం అని మొన్న విశాఖ సభలో తేల్చేశారు.. పైకి మీతో పొత్తు వద్దు అని భీరలు పోతూ.. పైన అదేనండి కేంద్రంలో మీకు బయట ఉంటూ మా సపోర్ట్ మీకు ఉంటుంది అని సంకేతాలు పంపిస్తున్నారు…పంపంచడం ఏమిటి ఎన్నో బిల్లుల ఆమోదానికి బీజేపీ అడగకుండానే చేతులు ఎత్తి జై కొట్టారు..వాళ్ళ పైన కేసులు.. ఒత్తిడులు కావచ్చు ఏది ఏమైనా జగన్ ..మోడీకి లొంగిపోయారు అనడంలో సందేహం లేదు.. ఎందుకంటే కేంద్రం తో గోడవులు ఎందుకు అనుకున్నారో.. లేక కేంద్రం తో పేచీ పెడితే వాళ్ళు ఎక్కడ అడ్డుపుల్లలు వేస్తారో అని జగన్ సందేహం అయ్యి ఉండొచ్చు..కాబట్టి బీజేపీ కి జగన్ తో లాభమే.. ఒక వేల సపోర్ట్ చెయ్యకపోయిన బీజేపీ ఇసుమంత నష్టం కూడా లేదు..పైగా జగన్ మోడీ ఎదిరించి పోరాడే సాహసం కూడా చెయ్యలేరు..ఇంటక ముందు కూడా చెయ్యలేదు అనుకోండి..సో బీజేపీ కి జగన్ తో ఎటువంటి నష్టం , లాభం లేదు… ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వద్దాం.. బాబు బీజేపీ తో పొత్తు కోసం తీవ్ర యత్నాలు చేస్తున్నారు అని.. అందుకు బీజేపీ అంగీకారం తెలపడం లేదని అక్కడక్కడ వినిపిస్తున్న కథనాలు..

బీజేపీ టీడీపీ తో కలిస్తే.. ముందుగా బీజేపీ తెలంగాణ లో బుస్టింగ్ లభిస్తుంది. టీడీపీ క్యాడర్ తెలంగాణ లో బలంగానే ఉంది.. గత రెండు ఎన్నికల్లో కేసీఆర్ బాబు బూచిక చూపే టీడీపీ ఓటు బ్యాంక్ తోను.. సెటిలార్ ఓటు బ్యాంక్ తో విజయం సాధించారు..బాబు కాంగ్రెస్ తో కూడా జతకట్టడం తో కేసీఆర్ పని మరింత ఈజీ కూడా అయ్యింది..కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతో trs ని brs మార్చేశారు..సరిగ్గా చంద్రబాబు కు కేసీఆర్ మళ్ళీ తెలంగాణ లో పాతుకుపోవడానికి మరో అవకాశం కల్పించారు.. అన్నదే తడవుగా బాబు కూడా టీటీడీపీ అధ్యక్షుడు గా బలం ఉన్న ముదిరాజ్ నాయకులు కాసాని జ్ఞానేశ్వరు కు అధ్యక్ష పదవి కట్టబెట్టి..పార్టీ విడిచి వెళ్లనా వారికి ఆహ్వానాలు పంపించారు.. తిరిగి పార్టీ లో చేరి.. మీ పార్టీ ని మీరే నడుపుకోండి అని సంకేతాలు కూడా ఇచ్చారు…క్యాడర్ ని బాబు కాపడుకుంటున్నారు.. అసలే మునుగొడులో ఓటమి పాలైన బీజేపీ కూడా trs ని ఎదుర్కోవాలి అంటే టీడీపీ తో జాతకడితే బెస్ట్ అనే ఉద్దేశం తో తెలంగాణ బీజేపీ లో కొందరు ముఖ్యనేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

ఎక్కడ ఈ విషయాన్ని బయటపెట్టకపోయిన కేంద్ర పెద్దల వద్ద మాత్రం అభిప్రాయని చెప్పారు అంటా ఆ ముఖ్యనాయలు.. కేంద్రం కూడా ఆలోచిస్తున్నట్టు భోగట్టా.. ఒకవేళ తెలంగాణ బీజేపీ టీడీపీ తో జాతకడితే.. ఇటు ఏపీలో కూడా బీజేపీ టీడీపీ,జనసేన లతో జాతకట్టే అవకాశం ఉంది…ఒకవేళ బీజేపీ కి అటువంటి ఆలోచన చెయ్యకపోతే పొత్తులు ఉండవు.. ఎవరికి వారే యమున తీరే అన్నట్టు ఉంటుంది…పొత్తు లేకపోతే టీడీపీ ఏపీలో జనసేన తోనో…లేక సింగిల్ గానే పోటీచేస్తుంది.. తెలంగాణ లో కూడా బీజేపీ పొత్తు వద్దు అనుకంటే trs తోనో లేక సింగిల్ గానే టీడీపీ పోటీ చెయ్యవచ్చు.. ఐతే చంద్రబాబు 40 ఏళ్లు రాజకీయాలు లో ఉన్నారు.. తక్కువ అంచనా వెయ్యడం కష్టం.. ఒకవేళ రూట్ మార్చితే కనుక బీజేపీ కి తీవ్ర నష్టం తప్పదు.. మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు 2019 అన్ని పార్టీలను కలిపి బీజేపీ పై పోరాటానికి వెళ్లి దెబ్బతిన్నారు గా బాబు.. ఇప్పుడు మళ్ళిన అనొచ్చు…కేసీఆర్ bsr అని పార్టీ పెరు మార్చి 4, 5 గురు నాయకులను కలిసిన ఫలితం లేదు.. మరి బాబు కూటమి కడతారు.. కడితే ఎవరు బాబు తో వస్తారు అని మీకు డౌట్ రావచ్చు..

చంద్రబాబు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు…ఇప్పుడు బాబు గనుక కూటమి కడితే.. బీజేపీ వ్యతిరేక వర్గాలు అన్ని బాబు వద్దకు చేరతాయి.. 2019 ముందు ఒక లెక్క దాని తరువాత ఒక లెక్క..ఎందుకంటే కేంద్రం లో కాంగ్రేస్ పుంజుకోలేదు.. కానీ బీజేపీ మాత్రం దెబ్బలు తింటుంది.. కానీ ఎంపీ ల బలం వల్ల పెద్దగా తెలియలేదు.. కాస్త లోతుగా వెళ్తే nda మిత్ర పక్షలు కూటమి నుండి ఒక్కక్కటి బయటకీ వచ్చేస్తున్నాయి…పంజబ్ లో చిరకాల మిత్రడు ఆకలిదళ్ బయటికి వచ్చింది.దెబ్బకి అక్కడ అప్ గెలిచి బీజేపీ కి తొలిదెబ్బ తీశారు…మహారాష్ర్టలో శివసేన బయటకు వచ్చింది. .. బీహార్ లో నితీష్ కుమార్ బయటకి వచ్చారు..పంజాబ్,బీహార్,మహారాష్టలో బీజేపీ కి వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి..మరో వైపు బెంగాల్ మమతా.. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్…కర్ణాటక లో కుమార్ స్వామి..తెలంగాణ లో కేసీఆర్… తమిళనాడు లో స్టాలిన్లు బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నారు గతంతో పోలిస్తే బీజేపీ కన్నా ఈ రాష్ట్రలలో ప్రాంతీయ పార్టీలు బలం గా ఉన్నాయి.. వీరు అందరితో జాతీయ స్థాయిలో పరిచయ ఉన్న నేత చంద్రబాబు..

చంద్రబాబు వీరందరినీ కలిపితే..యూపీ లో ఎస్పీ, బీఎస్పీ లు కూడా జతకడతాయి..గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ ని బాబు తో సహా పైన చెపుకున్న అన్ని ప్రాంతీయ పార్టీ లు దూరం పెడతాయి…కాబట్టి బీజేపీ చంద్రబాబు ని చావు దెబ్బకొట్టాలి అని చూస్తే కనుక.. ఖచ్చితంగా బాబు .. మోడీ షా లకు వణుకు పుట్టించడం ఖాయం.. గెలుపు ఓటములు ఓటర్లు నిర్ణయస్తారు.. కానీ తక్కువ అంచనా వేసిన నాయకులతోనే ప్రమాదం ఎక్కువ… బాబు ని కెల్లీక్కుంటే.. ఈజీ గా మళ్ళీ మాదే అధికారం అనుకునే బీజేపీ కి.. కంటి మీద కునుకు లేకుంటా చెయ్యగలడు.. కాబట్టి జగన్ కన్నా చంద్రబాబు తోనే అధిక లాభం… అధిక నష్టం కూడాను .. చంద్రబాబు ను కెలికి కయ్యానికి కాలు దువ్విచ్చుకుంటారో… సంకేతాలు ఇచ్చి పొత్తుకు దారి ఇచ్చుకుంటారో..ఇలాంటివి చాలా చూసాం అని సైడ్ ఇచ్చుకుంటారో.. వెయిట్ అండి సీ…

రామకృష్ణ పూడి, సత్యం న్యూస్. నెట్, విశాఖపట్నం

Related posts

ముంబై – జైపూర్ రైలులో కాల్పులు

Bhavani

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

Satyam NEWS

వివాదాలలో మగ్గుతున్న ఏసుక్రీస్తు జన్మస్థలం

Satyam NEWS

Leave a Comment