28.2 C
Hyderabad
May 17, 2024 12: 22 PM
Slider ఖమ్మం

సర్కారుపై మల్లు భట్టి సమర యాత్ర

samarayatra against the government

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  ఇచ్చిన తెలంగాణలో  అధికారంలోకి వచ్చిన కెసిఆర్  8 ఏళ్ల  పాలనలో  నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరనందునే సర్కారుపై పీపుల్స్ మార్చ్  పేరుతో సమర యాత్ర చేస్తున్నట్లు సి‌ఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు . పీపుల్స్ మార్చ్ పాదయాత్ర  శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో  జరిగింది. పాదయాత్ర కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది .ఈ సందర్భంగా పలు చోట్ల భట్టి మాట్లాడుతూ తన  పాదయాత్ర ఎన్నికల కోసం కాదని , ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనన్నారు. రైతుబంధు పేరిట ఎకరానికి 5వేల రూపాయలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు రూ. 30 వేల వరకు రైతులను నష్టపరుస్తుందన్నారు.

మాయ మాటలతో ప్రజలను మభ్య పెట్టి ప్రజా సమస్యలను పట్టించుకోవటంలేదన్నారు . తాను వారి సాగు చేస్తూ ఇతరులను మాత్రం వరి పంట వేయవద్దని చెప్పటం కే‌సి‌ఆర్ కే చెల్లిందన్నారు .  మాటల గారడీ చేస్తున్న కే‌సి‌ఆర్ కి తగిన గుణపాఠం చెప్పాలన్నారు . పీపుల్స్ మార్చ్ కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారన్నారు .

గ్రామానికి ప్రభుత్వ పెద్దలు వస్తే అభివృద్ది పై ప్రశ్నించాలన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకుండా, విద్య, వైద్యం, అందించకుండా, వంతెనలు నిర్మించకుండా, . ఇస్తామని ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా, పంట నష్టపరిహారం చెల్లించకుండా బంగారు తెలంగాణ ఎట్లా అయినదని దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర రాష్ట్రమంతా నిర్వహిస్తామని చెప్పారు. పాదయాత్ర కు పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు.

Related posts

పల్లెల్లో బలగం మినీ థియేటర్స్: ప్రొజెక్టర్ల ద్వారా సినిమా వీక్షణ

Satyam NEWS

అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక 

Satyam NEWS

బీజేపీ అధికారంలోకి వస్తే ఇళ్లులేని చేనేత కార్మికులందరికీ ఇండ్లు

Satyam NEWS

Leave a Comment