Slider నిజామాబాద్

పల్లెల్లో బలగం మినీ థియేటర్స్: ప్రొజెక్టర్ల ద్వారా సినిమా వీక్షణ

#balagam

పట్టణాల కన్నా పల్లె వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ప్రజల భావోద్వేగాలు, అనురాగం, ఆప్యాయతలు ఎక్కువ. పల్లె వాతావరణాన్ని, పల్లెల్లో జరిగే సంఘటనల నేపథ్యంలో ఇటీవల సినిమాలలో ప్రధానంగా కథలు వస్తున్నాయి. అదే కోవలో వచ్చిందే బలగం సినిమా. ఈ సినిమా సామాన్య ప్రజలకు అతి తక్కువ సమయంలో చేరువైంది. గ్రామీణ నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇంటి అల్లుని అలకలు, మనిషి చనిపోతే నిర్వహించే కార్యక్రమాలు, అంత్యక్రియల నుంచి ఖర్మ వరకు నిర్వహించే మూడు రోజులు, ఐదు రోజుల కార్యక్రమాలు ఇలా అన్ని అంశాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించడంతో పల్లెల్లో నివసిస్తున్న ప్రజలకు ఈ సినిమా దగ్గరగా చేరువైంది.

దాంతో వయసుతో సంబంధం లేకుండా ప్రజలు సినిమాను చూడటానికి సినిమా థియేటర్ల వైపు పరుగులు పెట్టారు. ఎన్నో ఏళ్ల క్రితం సినిమా థియేటర్ కు వెళ్లిన పండు ముసలి వాళ్ళు సైతం ఈ సినిమాను స్క్రీన్ పై చూడటానికి తహతహలాడారు. ఇటీవల బలగం సినిమా థియేటర్ నుంచి ఓటిటిలోకి వచ్చి చేరింది. దాంతో సినిమాను ఇంట్లోనే చూడటానికి వీలైంది. అయినా ప్రజలు థియేటర్లోనే చూడటానికి వెళ్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మధ్యతరగతి బంధాలు, బంధుత్వాలు ప్రజలకు చూపించడానికి గ్రామాల్లో ఉచితంగా మినీ థియేటర్లు వెలిశాయి.

గ్రామాల్లో పలుకుబడిని కొందరు నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు ప్రొజెక్టర్లను ఏర్పాటు చేసి ఉచితంగా ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో నిన్న రాత్రి ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి బలగం సినిమాను ప్రదర్శించారు. దాంతో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సినిమాను వీక్షించి భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఆసాంతం తమ జీవితానికి దగ్గరగా ఉందని పలువురు గ్రామస్తులు తెలిపారు.

సినిమా చూస్తున్నంత సేపు కన్ను పక్కకు తిప్పుకోలేకపోయామని పేర్కొన్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. నేడు తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొజెక్టర్ ద్వారా సినిమా ప్రదశించనున్నట్టు తాడ్వాయి వైస్ ఎంపీపీ తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సినిమాను వీక్షించాలని వాట్సాప్ గ్రూపులో సందేశం పంపించారు.

Related posts

నూతన సంవత్సరం లో నిర్మాత డీ ఎస్ ఆర్ మూడు కొత్త చిత్రాలు

Bhavani

వీరసింహారెడ్డి ఒక విస్ఫోటనం.. చరిత్రలో నిలిచిపోతుంది

Bhavani

చెరువులను సంరక్షిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.!

Satyam NEWS

Leave a Comment