31.7 C
Hyderabad
May 2, 2024 10: 41 AM
Slider నల్గొండ

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు తక్షణమే పెంచాలన్న సిఐటియు

#citu

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందాయని,నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని,కనీసం నెలకి 21,000 రూపాయలు ఇవ్వాలని ఈ నెల 16వ, తేదీన చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయటానికి కార్మికులు కదలిరావాలని రాష్ట్ర సి ఐ టి యు కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం,మండలాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు పాఠశాలలలో కరపత్రాలు పంచుతూ ఈ నెల నాలుగో తేదీన ఎం.ఈ.ఓ. కార్యాలయం ముందు ధర్నాలు,16వ, తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ కు కదిలి రావాలని కోరారు.

ఈ సందర్భంగా శీతల రోషపతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు  83 వేల మంది కార్మికులు 25 వేల పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులకు భోజనం చేస్తున్నారని,గత 19 సంవత్సరాల నుండి పని చేస్తున్నా వేతనం పెరగలేదని,గొర్రె తోక బెత్తెడు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ప్రతి విద్యార్థికి 15 రూపాయలు చొప్పున బడ్జెట్ కేటాయించాలని, కోడిగుడ్లు,గ్యాస్ కి,అదనంగా బడ్జెట్ కేటాయించడం చేయాలని,కనీస వేతనం 21వేలు ఇవ్వాలని తదితర 10 డిమాండ్లతో జరిగే ఆందోళనకు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు రాళ్ళబండి మంగమ్మ,గ్రేస్ మనీ,వెంకటరమణ,కళావతి,లలిత, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

అప్పుడు అరిచిగోల చేసిన మోదీ… ఇప్పుడు మౌనమేల?

Satyam NEWS

టాక్స్ ట్రాప్ : విల విలలాడుతున్న పెద్ద చేపను కాపాడే యత్నం

Satyam NEWS

అర్హులైన వారందరికి రుణ మాఫీ అందాలి

Bhavani

Leave a Comment