28.7 C
Hyderabad
May 6, 2024 09: 55 AM
Slider కవి ప్రపంచం

ఓ విఘ్నరాజా…

#PattemVasantha

నూతన పోకడలతో

సమాజం రీతులు మారుతూ

కాలం శరవేగంతో పరుగేడుతూ

రంగుల ప్రపంచంలో బతకులాయే

శ్రమ కోర్వని మనుష్యులు

ఆడంబరాల జీవితాల కోసం

విపత్కర పరిస్థితులకు కారణమై

కాలుష్యపు కోరల్లో చిక్కుకునే…

సమస్త జీవకోటికి మనుగడ లేక

ప్రకృతి, పర్యావరణానికి ముప్పు

‌అని తెలిసినా ఓ ఆదిదేవా..

ఈ మానవాళి లేక్కచేయరాయే..

నీ పండుగ పేరుతో విఘ్నరాజా

రంగు రంగుల విగ్రహలతో

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లతో

విషపూరిత రసాయనాలాయే..

నేటి తరానికే

స్వచ్ఛమైన గాలి లేక అల్లాడే

ఇక రేపటి తరానికి

ఏమి మిగుల్చరాయే..

మట్టి గణపతిని పూజించేలా

ఈ మనుష్యుల మనసు మార్చి

21పత్రాల విశిష్టతను తెల్పి

మమ్మల్ని కాపాడు ఓ గణపయ్యా..

పత్తెం వసంత, కరీంనగర్

Related posts

అర్జీయూకేటీ బాసర 5వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

సంప్రదాయ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలి

Satyam NEWS

అక్టోబర్ 2న అయోధ్యలో “ఆదిపురుష్” టీజర్ విడుదల వేడుక

Satyam NEWS

Leave a Comment