38.2 C
Hyderabad
May 2, 2024 22: 07 PM
కవి ప్రపంచం

వటవృక్షం

#Gudimetla Chennaiah

మౌనమే నీ భాషగా చేసుకున్నావు

వేయిపడగలను వేనవేల పడగలుగా మార్చావు

అనుకున్నది సాధించే నీ పట్టుదలకు

అందినది మహోన్నత దేశ ప్రధాని పదవి

ఆర్ధిక,పరిపాలన,భద్రత కలిగిన

మౌర్య సామ్రాజ్య స్ధాపకుడు నాటి చాణక్యుడు

రాజకీయ అస్ధిరత,అస్తవ్యస్త ఆర్ధిక స్ధితి కలిగిన

భరతభూమిని చక్కదిద్దిన నేటి చాణక్యుడవు

న్యాయవాదివి నీవు

ఉద్యమకారుడవు నీవు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వములో మంత్రిగా పలుశాఖలు నిర్వహించి

అఖిల భారత స్ధాయికి ఎదిగావు

కాంగ్రెసు పార్టీ జాతీయ అధ్యక్షుడవయ్యావు

తెరచాటున తెరచాపలా

దశాదిశ నిర్దేశం చేసిన మహానుభావా

బహుముఖ ప్రజ్ఞాశాలివి నీవు

బహుభాషా కోవిదుడవు నీవు

మాతృభాషని మరువని మహనీయుడవు నీవు

నీ ఓర్పే నీకు ఆయుధం

నీ ప్రతిభే నీ భవిష్యత్తుకు దిక్సూచి

నిరాడంబరుడవు నీవు, నిగర్వివి నీవు

అంగ బలం లేకపోయినా

ఆత్మబలంతో దేశాన్ని నడిపించిన ధీరోదాత్తుడవు నీవు

ఆర్ధిక శాస్త్రములో చాణక్యుడవు

రాజనీతిలో కౌటిల్యుడవు

మంచివారికి నరుడవు అవినీతిపరులకు నారసింహుడవు

వంగరలో పెరిగావు

వసుధంతా వెలిగావు

దేశ ప్రధానమంత్రి పదవిని పొందిన ఏకైక తెలుగు వీరా

సాహితీ సేవకా,సమరసింహా

అందుకో మా దండా లందుకో నరసింహ!

గుడిమెట్ల చెన్నయ్య, వాసుకి నగర్, కొడుంగైయూర్, చెన్నై -600 118. సంచారవాణి సంఖ్య: 97907 83377

Related posts

చెలియా….

Satyam NEWS

ఒకే ఒక్కడు

Satyam NEWS

గాంధర్వగానం

Satyam NEWS

Leave a Comment