24.7 C
Hyderabad
May 17, 2024 01: 21 AM
కవి ప్రపంచం

చైత్రా రావే

#KasulaLingareddy

నా కనులకు తాకిన నీ చూపులు

నా ఉదయాల్ని మరింత కాంతివంతం చేసాయి

నా మాటలకు మ్రోగిన నీ అందెల రవళులు

నా కవనాన్ని మరింత మాధుర్యం చేసాయి

నా భాషకు సోకిన నీ మేని యవ్వన సొగసులు

నా విశ్వాన్ని మరింత విశాలం చేసాయి

కాలం ఎప్పుడైనా శుభాశుభాల కలయికే కాని

నువ్వు నాకు అనంత శుభాల ఆకాంక్షల ప్రతినిధివి

ఈ చిత్త నక్షత్రపు ముత్యపు కాంతులు

చైత్ర మాసపు నిండు పున్నమి వెన్నెల వెలుగులు

ఈ నవనవోన్మేష బాలభానుని చిలిపి కిరణ చైతన్యాలు

మధుమాసపు మధురోహల తియ్యని గిలిగింతలు

నిన్నే పలవరిస్తున్నవి

నిన్నే కలవరిస్తున్నవి

లేత మామిడి పిందెను చేతబట్టినప్పుడు నువ్వే

మా ఇంటి గున్నమామిడి కొమ్మ మీది కోయిల కూజితాల్లోనూ నువ్వే

కొత్త రేకలు తొడుక్కున్న వసంత శోభలోనూ నువ్వే

ఈ నూతన వత్సర పచ్చడి వగరులోని పొగరూ నువ్వే

ఒక్క నువ్వే అనేక ఆక్రుతులు

ఒక్క నువ్వే అనేక విస్మ్రుతులు

ఎన్ని గతాబ్దములు దాటి వచ్చితివో

ఎన్నెన్ని షడ్రుచుల తీరుల ఎదల దాచుకుంటివో

ఎన్ని నిష్టూరపు కావ్యకన్నియల కంటివో

ఎన్నెన్ని ఆశల, ఆకాంక్షల అర్జీలను అందుకుంటివో

చిత్తా చంద్రుల సంయోగ భోగమందించే ఉగాదీ!

వసంత పురుషడనై నే వస్తున్నా

దమన పూజకు ద్వారాలు తెరవవే

భైరవారాధనకు బాహువులందించవే.

క్రొంగొత్త  సింగారాల చిత్ర విచిత్ర చైత్రా!

బంగారు తోరణాల కరుణాంత చిత్తా!

తీరని దాహాలు తీర్చగ రావే-

చేరరాని గమ్యాలు చేర్చగ రావే-

ఈ దీర్ఘ విలంబన నేనింక వోపలేనే-

డా. కాసుల లింగారెడ్డి, సెల్‌: 9948900691

Related posts

నడక నడక నడక …

Satyam NEWS

కప్పబతుకు

Satyam NEWS

స్ఫూర్తి నివ్వు

Satyam NEWS

Leave a Comment