38.2 C
Hyderabad
April 29, 2024 20: 48 PM
Slider కవి ప్రపంచం

స్ఫూర్తి నివ్వు

#PVS Krishnakumari

తన రక్తాన్ని పాలు అనే

అమృతంగా మార్చి

జీవం పోసింది నీ తల్లి

ఆ జీవాన్ని విషంతో హరిస్తున్న వేళ

ఆ తల్లి ముఖాన్ని ఒక్కసారి

గుర్తు చేసుకో

అత్త,తాత అంటూ నీకు మాటలు నేర్పి

నీ గొంతువిని మురిసిపోయే

నీ తల్లి తండ్రుల వదనాలు

నీ కంఠానికి ఉరి బిగిస్తున్న

ఆ చీకటి ఘడియల్లో గుర్తు తెచ్చుకో

ఆకాశం అంత ఎత్తుకు

నీవు ఎదగాలని కోరుకునేవారికి

ఆకాశహార్మ్యాల నుండి దూకి

నిరాశను మిగల్చవద్దు

అపజయాలు, అవమానాలకు

భీతిచెందక పోరాడు

వస్త్రాపహరణం జరిగినా కుంగిపోక

శత్రువు పై ప్రతీకారం తీర్చుకున్న

ఆ ద్రౌపది కసి నీలో ఉండాలి

బికారులుగా మారినా

ఆత్మస్థైర్యమే పెట్టుబడిగా

కుబేరులయిన వ్యాపారవేత్తల

స్పూర్తి నీలో నింపుకో

మూడునాళ్ళ ప్రేమ విఫలమైందని

నీవు చనిపోయి నీ ప్రేమనూ చంపక

బతికి నీ ప్రేమని అందరికీ పంచి

ప్రేమ విశ్వజనీయమైనదని

నిరూపించు

ఏకాకిని అని దిగులు చెందక

పరిస్థితులకు ఎదురొడ్డి

ఆత్మహత్య అనే భావనను హత్య చేసి

అందరికీ స్పూర్తి నిచ్చిన రోజు

ఈ ప్రపంచం నీకు

నీరాజనం పలుకుతుంది

(ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా)

-పీ.వి.యస్. కృష్ణ కుమారి, సెల్ నెం:9494510994

Related posts

మాస్కులు ధరిద్దాం.. కరోనాను ఎదుర్కొందాం

Satyam NEWS

Vijayanagaram Police: రెండున్నర గంటలు…45 ఫిర్యాదులు…

Satyam NEWS

సైన్స్ డే: భారత శాస్త్ర విజ్ఞానంపై ఇప్పటికీ రామన్ ఎఫెక్ట్

Satyam NEWS

Leave a Comment