25.7 C
Hyderabad
May 9, 2024 09: 35 AM
కవి ప్రపంచం

తెలుగు వారి ఉగాది

#RayavarapuSaraswati

తెలుగువారు ముంగిట్లో

తొలిసారిగ జరుపుకునే

తొలిపండగ ఉగాది

ఏనాడైనా కలగన్నామా

ప్రపంచానికి ఇలాంటి

కరోనావైపరీత్యంవస్తుందని?

అనుకున్నామా ఏనాడైనా

ప్రాణాంతక పిశాచిఒకటిమన

చుట్టమైదరిచేరుతుందని?

ఊహించామా ఎప్పుడైనా

కరోనా వైరస్ వలనప్రపంచం అతలాకుతలమవుతుందని

తొలిపండగ ఉగాది ఇలా

నీరసించిపోతుందని?

ఉగాది పండుగ నాడు

చిన్నా..పెద్దా ధరించే

పట్టు వస్త్రాల సంబరం ఎక్కడ

అమ్మ చేతి వంట ఘుమ ఘుమ లెక్కడ?

పసుపు గుమ్మాలకు మామిడి తోరణాలు ఎక్కడ?

మనం ఆరగించే షడ్రుచుల

ఉగాది పచ్చడి ఎక్కడ?

అయినా మానవాళి నిరుత్సాహ పడక పలుకుతోంది శ్రీప్లవనామసంవత్సరానికి

స్వాగతం..సుస్వాగతం

రాయవరపు సరస్వతి, చోడవరం,విశాఖ జిల్లా, మొబైల్ 7989665525

Related posts

మన తెలుగు వారి ఠీవి

Satyam NEWS

మన పల్లెటూరు

Satyam NEWS

మానసవనం

Satyam NEWS

Leave a Comment