28.7 C
Hyderabad
April 28, 2024 10: 52 AM
Slider కవి ప్రపంచం

నడక నడక నడక …

#Dr.Ketavarapu Rajyasree

సంకలో బిడ్డ  –

వీపున  మూట

నడినెత్తిన  ఎండ

కాళ్ళ కింద మంట

వందల మైళ్ళ  నడక

దేహం నుంచి చెమట చుక్కల ధారలు

ముక్కు పుటాలనుంచి నిట్టూర్పుల సెగలు

అన్నం కోసం పేగుల అరుపులు

నీళ్ళు ఇంకిన కళ్ళతో

నడక నడక నడక

నిండు నెలల గర్భిణీ..

డొంకల్లో నిస్సహాయ పురుడు_

పురిటి బిడ్డని పొదివి పట్టి

ఖాళీ కడుపుతో ..

నడక నడక నడక

ఉన్నచోట ఉంటే ఆకలి చావు

నలుగురితో కలిస్తే కరోనా చావు

ఉన్న ఊరినీ అయిన వారినీ వదలి

పిడికెడు గింజల కోసం

పక్షుల్లా ఎగిరి వచ్చిన

వలస కూలీల గోడు ..

చేరాలి సొంత గూడు_

చావైనా బతుకైనా

అయినవారి మధ్య ఉంటే చాలు_

డా.కేతవరపు రాజ్యశ్రీ +91 8500-121990 (C)

Related posts

మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం

Satyam NEWS

ఆవుల అక్ర‌మ ర‌వాణాకు పోలీసులు అడ్డుక‌ట్ట‌

Satyam NEWS

తక్షణమే ముఖ్యమంత్రి పదవిని వికేంద్రీకరించాలి

Satyam NEWS

Leave a Comment