40.2 C
Hyderabad
May 2, 2024 17: 23 PM
కవి ప్రపంచం

విపత్తులో విజ్ఞతా విత్తులు నాటాలి!

#GundanaJogarao

ఎంత వికృతంగా

హాసిస్తోందీ మహమ్మారి…

ఉక్కిరిబిక్కిరి చేస్తూ

అమాయకుల ప్రాణాలపై స్వారీ…

రక్కసి స్వైర విహారాన్ని

అరికట్టే ప్రయత్నం జరుగుతోంది…

ప్రయోగశాలలో గుప్పెడు కళ్ళు

ప్రయోజనాత్మక ఫలితాలకై

నిరంతరం కృషి చేస్తూ…

ప్రజల ముందుకొచ్చిన మందు

శతశాతం సానుకూలం కాకపోవచ్చు…

హత శాతాన్ని తగ్గించడంలో

సహకరిస్తే అభినందించాల్సిందే…

” దేముడా…నీవే దిక్కు”అని

భారం వేసి ఊరుకోకుండా

వైద్యరూప దైవాల ఆదేశాల్ని పాటించాలి

అప్రమత్తతని గుండెల్లో విత్తుకోవాలి

విజ్ఞతతో ఒక లక్ష్య సాధనకై పరితపించాలి–

” ప్లవ” నామ వత్సరంలో

మనిషి విప్లవాత్మకంగా ఆలోచించాలి

స్తబ్ద జీవనంలో    మార్పుకై శోధన చెయ్యాలి

రోదనల్నీ వేదనల్నీ సమీక్షిస్తూ

దైనందిన బ్రతుకు చిత్రానికి

మానవీయ మెరుగులు దిద్దాలి

గుండాన జోగారావు, సింహాచలం, 9490185708

Related posts

ప్రేమంటే

Satyam NEWS

మన తెలంగాణ బిడ్డ

Satyam NEWS

మాతా నీకివే…

Satyam NEWS

Leave a Comment