30.2 C
Hyderabad
May 17, 2024 18: 31 PM
Slider వరంగల్

సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

#taslima

ఉన్నత స్థాయి అధికారిణిగా ఉద్యోగ  బాధ్యతలు నిర్వర్థిస్తూనే,సామాజిక సేవ చేయటం అభినందనీయమని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సేవలను జిల్లా రిజిస్ట్రార్ (వరంగల్) హరికోట్ల రవి కొనియాడారు. సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & పౌండేషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట, స్టేట్ బ్యాంక్ ఎదుట చలి వేంద్రాలు ఏర్పాటు చేయగా గురువారం ముఖ్య అతిథిగా రవి హాజరయ్యారు.

తస్లీమా అతనికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. జిల్లా రిజిస్ట్రార్ రవి మొదట తస్లీమాతో కలిసి గ్రంధాలయం అవరణంలో మొక్కలు నాటారు. అనంతరం చలి వేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు. రిజిస్ట్రేషన్ ఎదైనా ఇబ్బందులు ఉంటే తనను నేరుగా సంప్రదించగలరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & పౌండేషన్ సభ్యులు,కార్యాలయ సిబ్బంది, దాస్తావేజులేకరులు,స్టాంప్ వెండర్లు తదితరులు ఉన్నారు.

Related posts

మిర్యాలగూడ లో ఘనంగా హరితహారం కార్యక్రమం

Satyam NEWS

మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో  బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదు

Satyam NEWS

Leave a Comment