రాజధాని కోసం శాంతియుత నిరసనలు చేస్తున్నామని…పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్ట్‌లకు భయపడేది లేదని, ఎన్ని అరెస్ట్‌లు చేసినా వెనకడుగు వేయమని స్పష్టం చేశారు.
అమరావతి కోసం ఎంత వరకైనా ఉద్యమిస్తామని నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. రాజధాని తరలింపునకు నిరసనగా జాతీయ రహదారుల దిగ్బంధానికి పొలిటికల్ జేఏసీ పిలుపునివ్వగా అప్రమత్తమైన పోలీసులు ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అలాగే నక్కా ఆనంద్‌బాబును కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.