Slider వరంగల్

మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో  బతుకమ్మ సంబరాలు

#batukamma

నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ లోని  స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమం లో  బొడ్డేమ్మ, బతుకమ్మ వేడుకలను ముఖ్య అతిథిగా  ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాoప్రదాయాలకు ఈ బతుకమ్మ పండుగ నిదర్శనం అని, ప్రకృతి లోని పూలన్నింటిని ఒక దగ్గర చేర్చి బతుకు నిచ్చే అమ్మవారిని బతుకమ్మ గా పేర్చి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగ ను ఈ సంస్థ లోని మానసిక దివ్యంగుల మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పూలను దేవతగా కొలిచేది ఒక తెలంగాణ రాష్ట్రం లోనేనని అన్నారు. తదుపరి బతుకమ్మ ఆట పాటలు, కోలాట నృత్యాలతో పిల్లలు, టీచర్స్ తో పాటుగా డాక్టర్ అనితా రెడ్డి సందడి చేసారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ అనితా రెడ్డి, సంస్థ నిర్వాహకులు సుచరిత, వసుధ హరిత, ఉమ, మానస, రాజేందర్ రెడ్డి  సిబ్బంది, పిల్లలు పాల్గోన్నారు.

Related posts

శ్రీశైల మల్లికార్జునస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి

Satyam NEWS

షబ్బీర్ అలీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన గంప

Satyam NEWS

పోలీసు శాఖలో చిన్న కేడర్ ఉద్యోగికి బాస్ సత్కారం…

Satyam NEWS

Leave a Comment