28.2 C
Hyderabad
May 17, 2024 10: 48 AM
Slider మహబూబ్ నగర్

శాస్త్రవేత్తలు మేలురకమైన వంగడాలను రూపొందించాలి

#udakumarias

వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను రైతులకు మరింత చేరువ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం బిజినపల్లి మండల పరిధిలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజుల దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తీర్ణ సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో రెండు రోజుల సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో చేపడుతున్న వివిధ రకాల పరిశోధన ఫలితాలు రైతులకు మరింత లాభదాయకంగా మేలు చేయాలన్నారు.

 రైతులు విత్తనం విత్తేప్పటి నుంచి పంటలను అమ్ముకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను ప్రతి వ్యవసాయ క్లస్టర్ కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచిందన్నారు.

రైతులు ఒకే రకమైన వరి పంట కాకుండా చిరుధాన్యాలు పండించే విధంగా అధికారులు ప్రోత్సహించాలన్నారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించి సహజసిద్ధమైన సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో నీటి లభ్యతను బట్టి రైతులు పంటలు సాగు చేయాలన్నారు.

చిరుధాన్యాలు పండించేందుకు జిల్లాలోని నేలలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. శాస్త్రవేత్తలు భూతాపాన్ని తగ్గించేందుకు పరిశోధన చేపట్టాలన్నారు. జిల్లాలో వేరుశెనగ, పచ్చిమిర్చి, పత్తి పంటలు సాగు సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించి రైతులు అధిక లాభాలు గడించేలా వంగడాలను రూపొందించాలని సూచించారు. ఒకే రకమైన పంటల ద్వారా సారవంతమైన భూములు సైతం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతం కంటే వ్యవసాయ విస్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది అన్నారు. తదనుగుణంగానే మేలు రకమైన పంటల వైపుకు రైతుల దృష్టి ఆకర్షించేలా మేలురకమైన లాభదాయక వంగడాలను రూపొందించాలన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో రైతులు యాసంగి వర్షాకాలంలో ఏ రకమైన పంటలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయో అన్ని వివరాలతో పాటు పంట వివరాల సాగు చేసే విధానం తో బ్రౌజర్లను ప్రదర్శించేందుకు రూపొందించాలని కలెక్టర్ సూచించారు.

యాసంగి సాగు పెరిగింది

ప్రొఫెసర్ జయశంకర్ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ దక్షిణ తెలంగాణ మండలంలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదగిరి, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాలు ఉన్నాయన్నారు పంట సాగు 9, 23, 482 హెక్టార్లలో సాధారణ సాగు విస్తీర్ణం కాగా 4, 85,032 హెక్టార్ల కంటే 90 శాతం సాగు పెరిగిందన్నారు. యాసంగి లో వర్షపాతం పెరగడం వల్ల గణనీయంగా విస్తీర్ణత సాగు పెరిగిందన్నారు.

రైతులు ఆర్గానిక్‌ ఉత్పత్తుల తయారీపై దష్టి సారించేలా వంగడాలను రూపొందిస్తున్నామన్నారు.   భూసార యాజమాన్యం పద్ధతులు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అనంతరం వాతావరణ మార్పు- మెట్ట వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత, వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం, పెసర పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు తదితర బ్రోచర్‌లను రూపొందించి వ్యవసాయ క్లస్టర్లలోని రైతు వేదికల్లో రైతులకు ఉపయోగకరంగా ఉండేలా రూపొందిస్తామని కలెక్టర్ సూచనల ప్రకారం వ్యవసాయ పద్ధతుల యాప్ ను రూపొందిస్తామని తెలిపారు.

తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన రైతు బైరాపాగ రాజు ప్రకృతి వ్యవసాయంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రైతుకు 2022 జాతీయ స్థాయి ఉత్తమ రైతు అవార్డును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

చిరుధాన్యాలతో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన పండ్లతో తయారుచేసిన చాక్లెట్లు రుచి చూశారు. చిరుధాన్యాలతో తయారుచేసిన పదార్థాలను పరిశీలించి నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో విస్తీర్ణత సంచాలకులు డాక్టర్ సుధారాణి పాలెం ఎడిఆర్ డాక్టర్ గోవర్ధన్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్ రావు, దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ శాస్త్రవేత్తలు,  విస్తీర్ణ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతు సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

ఓపెన్ లెటర్: అమ్మ ఒడి పథకం పేరుతో మోసం

Satyam NEWS

కొవిడ్ మాస్క్ ల తయారీలో నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్

Satyam NEWS

ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

Satyam NEWS

Leave a Comment