37.2 C
Hyderabad
May 2, 2024 12: 53 PM
Slider ఖమ్మం

ఈనెల 26న వాహనాల వేలం

vehicle auction on the 26th of this month

ఖమ్మం పోలీస్ కమిషనరేట్  పరిధిలోని వివిధ ప్రాంతాలలో రోడ్లపై వదిలేవేయబడిన, గుర్తుతెలియని వాహనాలను ఈనెల 26న ఖమ్మం సిటీ ట్రైనింగ్ సెంటర్లో వేలం వేయనున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు. సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం పోలీస్ స్టేషన్లలో ఉన్న 357 వాహనాలను సంబంధిత యజమానులు తీసుకెళ్లాలని, ఆరు నెలల్లోగా తీసుకోకపోతే వేలం వేస్తామని గత ఏడాది జులై , ఆగష్టు నెలలో ప్రకటించామని, ఇప్పటి వరకు వాహనాలను తీసుకెళ్లేందుకు రానివాటిలో  మొత్తం వివిధ రకాల 338 వాహనాలలో 316 వాహనాలు ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రంలో, 22 వాహనాలు ముదిగొండ పోలీస్ స్టేషన్ లో  ఈనెల 26న వేలం వేయనున్నట్లు ప్రకటించారు. వేలంలో పాల్గొనే వారు ఆధార్ కార్డు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో సహా హాజరుకావాలన్నారు.  వేలంపాటలో పాల్గునే వారు వాహనములను చూడవచ్చని , ఇతర వివరాల కోసం ఏంటిఓ ,ట్రాఫిక్ సిఐ, ముదిగొండ యస్ఐ లను సంప్రదించాలన్నారు.         

Related posts

యాదాద్రి గోపురానికి కిలో బంగారం ఇచ్చిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

భక్తి శ్రద్ధలతో గురునానక్ జయంతి వేడుకలు

Satyam NEWS

కన్నడ సంచలనం “తారకాసుర” తెలుగులో!!

Satyam NEWS

Leave a Comment