32.7 C
Hyderabad
April 27, 2024 00: 10 AM
Slider విశాఖపట్నం

ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

#L G Polymers

ఎల్జీపాలిమర్స్ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఎన్‌జీటీకి జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 12 మంది ఈ దుర్ఘటనలో మరణించిన విషయం తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి వెలువడిన విషయవాయువు సంఘటనకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో విచారణ కొనసాగుతున్నది.

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో అందచేయాలని ఎన్‌జీటీ విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ కి ఆదేశించింది. ఈ మేరకు కమిటీ పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించింది. మనవతప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నిర్ధారణకు వచ్చింది.

విచారణ కమిటీ నివేదిక పై అభ్యంతరాలుంటే 24 గంటల్లో తెలపాలని ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్‌జీటీ స్పష్టం చేసింది. నివేదిక పరిశీలించి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని ఎన్‌జీటీ వెల్లడించింది. నేడో,రేపో ఎన్‌జీటీ తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

కాకినాడ ఆర్టీసి కాంప్లెక్స్ లో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Satyam NEWS

టెంపుల్ఇష్యూ:ఈ.ఓ కుదిరితే ట్రాన్స్ఫర్ వీలైతే సెలవు

Satyam NEWS

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : సీపీ రామగుండం

Satyam NEWS

Leave a Comment