27.7 C
Hyderabad
May 15, 2024 05: 45 AM
Slider నల్గొండ

పర్మినెంట్ కార్మికులతో సమానంగా వేతనాలు అమలు చేయాలి

#roshapati

సిమెంట్ పరిశ్రమలో కనీస వేతనాలు లేక ఆవేదనలో సిమెంట్ కార్మికులు ఉన్నారని,కనీస వేతనం నెలకు 26,000 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పరిశ్రమల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం  లోని సిమెంట్ పరిశ్రమలకి దేశవ్యాప్తంగా ఈ నెల 28,29న జరుగే సార్వత్రిక సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం  కాంట్రాక్ట్ కార్మికులకు సమ్మె కరపత్రాలు పంచిన అనంతరం రోషపతి మాట్లాడుతూ సిమెంటు పరిశ్రమలలో  వే జ్ బోర్డ్ వేతన ఒప్పందాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందాయని,ఈ ప్రైవేటీకరణ నయా ఉదారవాదంతో సిమెంట్ పరిశ్రమలలో నూటికి 75 శాతం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు పర్మినెంట్ కార్మికుల చేసినంత పని చేస్తున్నా పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే వేతనం ఇవ్వకపోవడం అన్యాయమని,దీనిపై 2016 అక్టోబర్ లో సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిందని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా నేటికీ పరిశ్రమలు అమలు చేయడం లేదని అన్నారు.ఇలాంటి సమస్యలపై ఈనెల 28,29న,జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య,సి ఐ టి యూ మండల కన్వీనర్ ఎస్ కె రణమియా,ఐ ఎన్ టి యు సి నాయకులు ఇంటి అచ్చమ్మ, ప్రభాకర్,శ్రీను,హనుమ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కరోనా నియంత్రించకుంటే భవిష్యత్తు ఉండదు

Satyam NEWS

గవర్నర్ తమిళిసైతో సిఎం కేసీఆర్ భేటీ

Satyam NEWS

కల్వకుర్తి డిపోకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు

Satyam NEWS

Leave a Comment