23.7 C
Hyderabad
May 17, 2024 04: 37 AM
Slider అనంతపురం

పదిమంది ప్రాణాలు కాపాడినందుకు సీఎంకు రుణపడి ఉంటాం..!

#topudurtiprakashreddy

చిత్రావతి నదిలో చిక్కుకున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ఆఘమేఘాల మీద స్పందించి వారందరి ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి మండలం వెల్దుర్తి సమీపంలోని చిత్రావతి వద్ద కర్నాటక వాసులు నలుగురు కారులో వెళ్తూ వరద నీటిలో చిక్కుకోగా వారిని కాపాడేందుకు వెళ్లిన ఆరుగురు కూడా జెసిబి సహా ఇరుక్కున్నారు.

వారందరినీ కాపాడి ఏడాది కావడంతో ఆరోజు రెస్క్యూలో పాల్గొన్న, వారిని అభినందిస్తూ శనివారం అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మాట్లాడుతూ గతేడాది నవంబరు 19న చిత్రావతి వరదలో కొందరు చిక్కుకున్నారని స్థానిక నాయకులు నా దృష్టికి తెచ్చారు. ఉధృతి తగ్గుతుందని అనుకున్నాం. పరిస్థితి చేయిదాటే ప్రమాదముందని స్థానిక సీఐ చెప్పారు. ప్రాణ నష్టం జరిగే వీలుందని అప్రమత్తం చేశారు. వెంటనే నేను.సీఎం  దృష్టికి తీసికెళ్లా. ఆయన వెంటనే స్పందించి తక్షణమే రక్షిత చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రతీ 5 విముషాలకోసారి పర్యవేక్షించేలా.సీఎం  చర్యలు తీసుకున్నారు. బెంగుళూరు నుండీ హెలికాఫ్టర్ తెప్పించి 10 మంది ప్రాణాలను సురక్షితంగా కాపాడారు. ఈ రెస్క్యూలో పాల్గొన్న ఎస్పీ, ఇతర పోలీసులు, ఫైర్, స్థానికుల నాయకులు అందరూ రియల్ హీరోలే. ఎస్పి పక్కిరప్ప మాట్లాడుతూ… రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. దృష్టికి తీసుకెళ్లడం… వెంటనే సీఎం.ఆదేశాలు ఇవ్వడం… బెంగుళూరు నుండీ హెలికాప్టర్ తెప్పించి వరద నీటిలో చిక్కుకున్న వారందరినీ రక్షించాం. ఆ 10 మందికి పునర్జన్మ కల్గినట్లే. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. సమస్వయంతో సహకరించారు. బాధితులను రక్షించేందుకు పోలీస్ కమ్యునికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం కూడా 10 మందిని రక్షించడంలో దోహదమైంది

సత్యం న్యూస్.నెట్ అనంతపురం

Related posts

అరుణాచల గిరి ప్రదర్శనకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు

Satyam NEWS

పారదర్శకంగా బదిలీ ప్రక్రియ

Murali Krishna

Over|The|Counter < What Vitamin Supplements Are Good For High Blood Pressure

Bhavani

Leave a Comment