38.2 C
Hyderabad
April 29, 2024 20: 58 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి ఆర్డీవో కార్యాలయ భవనం రికార్డుల నిర్వహణను ప్రారంభించిన మంత్రి

#wanaparthy

వనపర్తి, రాజస్వ మండలాధికారి కార్యాలయ భవనం రికార్డుల నిర్వహణ, సిబ్బంది సౌకర్యార్థం మరమ్మత్తులు, నిర్మాణ పనులను పూర్తిచేసి, పునః ప్రారంభం చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. శనివారం వనపర్తి పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మి న్ బాషాతో కలిసి ఆయన పునః ప్రారంభోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతన ఆర్.డి.ఓ.గా వనపర్తి బాధ్యతలు స్వీకరించిన ఎస్.పద్మావతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్.డి. ఓ. కార్యాలయం రికార్డుల నిర్వహణ, సిబ్బంది సౌకర్యార్థం మరమ్మత్తులు నిర్మాణ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. వనపర్తి, జిల్లాగా ఏర్పడిన అనంతరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఆయన అన్నారు.

ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలని, ప్రతి ఒక్కరికీ సేవలు అందేలా అధికారులు విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా,  జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఆర్.డి. ఓ. పద్మావతి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆర్.డి. ఓ. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సీఎంకు సిపిఐ లేఖ

Sub Editor

తెలంగాణాలో షర్మిలను ఆదరిస్తారా ! కాదు పొమ్మంటారా ?

Satyam NEWS

15-18 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్

Sub Editor

Leave a Comment