24.7 C
Hyderabad
May 17, 2024 00: 54 AM
Slider ముఖ్యంశాలు

కేదార్నాథ్ శివలింగంపై నోట్లు వెదజల్లిన మహిళ

#Kedarnath Shivalinga

పదకొండవ జ్యోతిర్లింగం కేదార్నాథ్ గర్భగుడిలో అపచారం జరిగింది. ఓ మహిళ నోట్లను శివలింగంపై వెదజల్లింది. ఆమె గర్భగుడిలో నోట్లు జల్లడంపై వివాదాస్పంగా మారింది.ఆమె లింగం పై నోట్లు జల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ కమిటీ సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. మహిళ లింగం నోట్లు వెదజల్లే వీడియో రెండు రోజుల క్రితం వైరల్గా మారింది.

అయితే ఈ పోస్ట్ చేసినట్లు తెలిస్తోంది. ఆ మహిళ గర్భగుడిలో డబ్బులు నోట్లు వెదజల్లుతున్నప్పుడు అక్కడున్న పూజర్లు కూడా మంత్రాలు చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటన జరిగినప్పుడు కేదార్ ఆలయ కమిటీ ఉద్యోగులు కూడా ఆలయం లోపల ఉన్నారని తెలుస్తోంది.

నిజానికి కేదార్ నాథ్ గర్బగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేదం.. కానీ ఆ మహిళ నోట్లు జల్లడమే కాకుండా.. నోట్లు జల్లుతున్నప్పుడు వీడియో కూడా తీయించుకుంది.ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దేవాలయంలో ఇదేం పని చాలా మంది ప్రశ్నించారు.

దీనిపై కేదార్ నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు వివరణ ఇవ్వాలని, అలాగే ఈ విషయంలో వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ విషయమై రుద్రప్రయాగ జిల్లా మేజిస్ట్రేట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సందర్భంలో డీఎం మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ మహిళ చేసిన ఈ చర్య సిగ్గుచేటని అన్నారు. బాబా కేదార్నాథ్ కోర్టులో ఇలాంటి చర్య క్షమించరాన్నారు.

కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అయిన బాబా కేదార్నాథ్ గర్భగుడిలో ఓ మహిళ డబ్బులు వెదజల్లడం తప్పుడు పనికి పాల్పడిందన్నారు.ఘటన జరిగినప్పుడు కేదార్ నాథ్ ఆలయంలో ఉన్న కమిటీ ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకున్నారు. అయితే నోట్లు వెదజల్లిన మహిళ ఎవరో తెలియరాలేదు.

Related posts

అస్వస్థతకు గురైన అన్నా హజారే.. ఆస్పత్రికి తరలింపు

Sub Editor

హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు నాయి బ్రాహ్మణ కులస్తుల మద్దతు

Satyam NEWS

DSR ట్రస్ట్ ఆధ్వర్యంలో చురుకుగా సేవా కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment