25.2 C
Hyderabad
May 16, 2024 20: 54 PM
Slider విజయనగరం

ఎస్పీగా చార్జ్ తీసుకున్న మ‌రుక్షణం మీడియా సమావేశం నిర్వ‌హ‌ణ‌… !

Vijayanagaram police

విజ‌య‌న‌గ‌రం  జిల్లా కు ఎవ‌రైనా కొత్త అధికారులు త‌మ‌,త‌మ బాధ్య‌త‌లు తీసుకుంటారంటే మొట్ట మొదట తెలిసేది..ప్ర‌జా పౌర సంబంధాల అధికారికే. ఈ విష‌యంలో పోలీస్ పీఆర్ ఓ శ‌భాష్ అనే చెప్పాలి.

ఈ శాఖ కు పౌర సంబంధాల‌,స‌మాచార అధికారి గా ఉంటున్న కోటేశ్వ‌ర‌రావుకు ఇర‌వై ఏళ్ల అనుభ‌వం ఉంది. ఈ ఏడాది మార్చి నుంచీ జిల్లాకు కొత్త ఎస్పీ వ‌స్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇటీవ‌లే నెల రోజ‌ల క్రితం ప్ర‌స్తుత  ఎస్పీ రాజ‌కుమారీ.

ప‌క్క ప్రణాళిక‌తో మీడియాను వెంట‌పెట్టుకుని గిరిజ‌న  ప్రాంతాల‌ను సంద‌ర్శించి  ఎగ‌మమండంకి త‌దిత‌ర‌ ఏరియాల‌లో శ్ర‌మ‌దానంతో రోడ్లు వేసి మ‌రీ  వాళ్ల‌ల్లో వెలుగులు నింపారు. మొత్తం మీడియాను పోలీస్ శాఖ తీసుకెళుతున్న నేప‌ధ్యంలో అప్పుడే ఎస్పీ రాజ‌కుమారీకి స్థాన చ‌ల‌నం త‌ప్ప‌ద‌న్న ఊహగానాలు వెలువ‌డ్డాయి.

ఆ సంద‌ర్బంలోనే పీఆర్వో  కూడా కొత్త‌ దీపికా పాఠిల్  రావొచ్చ‌న్న అనుమానం కూడా వ్యక్తం చేసారు. పోలీస్ శాఖ  అదీ పౌర  స‌మాచార సంబంధాల‌ను ఎప్ప‌డు,మీడియాకు ఇవ్వాలో ఏ విధంగా ఇవ్వొచ్చో ఓ అవ‌గాహ‌న ఉన్న వ్య‌క్తి పీఆర్ఓ. జ‌ర్న‌లిజం చేసిన కోటేశ్వ‌ర‌రావు  శాఖా ప‌రంగా పోలీస్ ఉద్యోగికావ‌డంతో ఏ స‌మాచారం ఎప్పుడు ఇవ్వాలి, అస్స‌లు మీడియాకు స‌మాచారం ఇవ్వొచ్చా  లేదా అన్న  జ్ఙానం ఉన్న పోలీస్ అధికారి.

అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌నే కొత్త ఎస్పీగా బాధ్య‌తలు చేప‌ట్ట‌నున్న దీపికా పాఠిల్ విష‌యంలో పీఆర్ వో తీసుకున్న జాగ్ర‌త్త‌లు.

ఈ నెల 12  మ‌ధ్యాహ్నం 12.30 కొత్త ఎస్పీ బాద్య‌త‌లు తీసుకుంటార‌ని మీడియాకు స‌మాచారం ఇచ్చిన ఆయ‌న పాత ఎస్పీ చివ‌రి కార్య‌క్ర‌మానికి ఓ పీఆర్వ్ గా హాజ‌రవ‌డమే గాక అంత‌లోనే ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు స‌మాచారం ఇవ్వ‌డంతో పాటు క‌రోనా జాగ్ర‌త్త‌లు చెబుతూ..కొత్త ఎస్పీ దీపికా పాఠిల్ చే కాన్ఫ‌రెన్స్ హాలులో తొలిసారి మీడియా స‌మాచారం అటు శాఖ‌కు, ఇటు మీడియాకు వార‌ధిగా నిలిచారు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్.నెట్

Related posts

Hemp Cbd Oil Co2 Extract 3rd Party Tested

Bhavani

పడిగరాయి గుట్ట శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహ స్వామికి విశేష పూజలు

Satyam NEWS

ఏ కుల సంఘానికి ఏ అవసరం వచ్చినా తీరుస్తా: ఎమ్మెల్యే కాటిపల్లి

Satyam NEWS

Leave a Comment