30.2 C
Hyderabad
May 17, 2024 14: 51 PM
Slider ప్రత్యేకం

బిఆర్ఎస్ బహిరంగ సభకు జాతీయ మీడియాలో విస్తృత కవరేజి

#kcr

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాంతీయ భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ జాతీయ దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల్లో ఖమ్మం బహిరంగ సభకు విస్తృత ప్రచారం లభించింది. ప్రధాన పత్రికలన్నీ బ్యానర్ ఐటమ్ గా ఈ వార్తను ప్రచురించడంతో పాటు లోపలి పేజీల్లోనూ వార్తను సమగ్రంగా ప్రచురించాయి.

హిందీ, ఇంగ్లీష్ జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం ఖమ్మం సభకు ప్రత్యేక స్లాట్ లను కేటాయించాయి. యుట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా వేదికలు లైవ్ కవరేజీతో పాటు ప్రత్యేక కథనాలను ప్రచారం చేశాయి. దేశం కోసం మరో శక్తి బయలుదేరిందనే సంకేతం ఖమ్మం బహిరంగ సభతో యావత్ భారతదేశానికి అందింది.

పలువురు సీఎంలు, ఇతర పార్టీల జాతీయ నేతల యాదాద్రి ఆలయ పర్యటన, కంటి వెలుగు ప్రారంభోత్సవం తదితర ముఖ్యాంశాలు, విశేషాలు, విశ్లేషణలతో కవరేజి తెలుగు మీడియా రంగంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా మాధ్యమాల్లో అద్భుతంగా వచ్చింది. తెలుగు మీడియా అంతటా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని కేంద్రీకృతం చేసుకొని దాదాపుగా అన్ని పత్రికలు బ్యానర్ ఐటెమ్స్, సబ్ హెడ్డింగ్స్, సైడ్ లైన్స్, ప్రత్యేక బాక్స్ లతో ప్రచురించడం విశేషం. కేవలం తెలంగాణ రాష్ట్ర ఎడిషన్లు, జిల్లాల ఎడిషన్లకే పరిమితం కాకుండా ఇతర ఎడిషన్లలోనూ విస్తృత కవరేజి వచ్చేలా ప్రచురించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రధాని మోదీ వ్యవహారశైలిలపై సీఎం కేసీఆర్ తో పాటుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితర నేతల ప్రసంగాలను హైలెట్ చేస్తూ అన్నింటిలోనూ రాశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ భారీ బహిరంగ ఆవిర్భావ సభకు విచ్చేసిన లక్షలాది మంది ప్రజల జన సందోహ చిత్రాలను ప్రముఖంగా వేశారు. సీఎం కేసీఆర్, ఇతర జాతీయ నాయకుల సమైక్యతా ఫోటోలు, బహిరంగ సభకు హాజరైన ప్రజల ఆనందోత్సాహాలు, సందడి, కేరింతలతో కూడిన ఫోటోలు అన్ని రకాల తెలుగు మీడియాలో హోరెత్తిపోయాయి.

‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ పత్రికా రంగ చరిత్రలోనే మొదటిసారిగా బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభ ఫోటోను పేపర్ మొదటి పేజీలో అడ్డంగా అచ్చువేసింది. బీఆర్ఎస్ తడాఖా.. కేంద్రమా కాస్కో’ అని పేపర్ టాప్ లో ప్రత్యేకంగా డిజైన్ చేసి వేశారు. మీడియానిండా బీఆర్ఎస్సే, ట్రెండింగ్ సభ, తెరపైకి తెలంగాణ మాడల్, జనమా..ప్రభంజనమా.. శభాష్ అజయ్..భేష్, మంత్రి హరీష్ రావుకు ప్రశంస అనే వార్తలను ప్రత్యేక ముందస్తు పేజీల్లో వేశారు. ‘మోదీ ఇంటికి.. మనం ఢిల్లీకి’ అనే హెడ్డింగ్ తో సీఎంలు, విపక్ష జాతీయ నేతలతో కూడిన ఫోటోతో ప్రధానంగా వేశారు. బహిరంగ సభలో ప్రసంగించిన జాతీయ, రాష్ట్ర నేతల ప్రసంగాలతో కూడిని ఫోటోలు, హాజరైన జనం కేరింతలు, ఉత్సాహాలు, సందడి, కళాకారులు ఆటాపాటల ఫోటోలతో నమస్తే తెలంగాణ పెద్ద ఎత్తున కవరేజిని ఇచ్చింది.

ఎడిటోరియల్ తో పాటుగా విశ్లేషకుల వ్యాసాలనూ వీటికి జోడిస్తూ ఆసక్తికరంగా, ఉత్తేజితంగా నమస్తే తెలంగాణ ప్రచురించబడింది. మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, విశ్లేషకులు ఎందరో బీఆర్ఎస్ పార్టీ ఆరంభ సభపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ బీఆర్ఎస్ ను స్వాగతించారు. ఈనాడు దినపత్రిక..ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభను ‘మేం దిల్లీకి.. మోదీ ఇంటికి’ అంటూ శీర్షిక పెట్టి, సైడ్ హెడ్డింగ్ లతో రాశారు. కేంద్రంపై సమరశంఖం..

అంటూ ఈనాడు ఆన్ లైన్ లో చక్కటి ఫోటోలతో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గురించి వివరించడం బాగున్నది. నాయకుల ప్రసంగాల విశ్లేషణను కూడా తెలియజేశారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి పథకాల గొప్పదనాన్ని వివరిస్తూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారును, మోదీని విపక్ష నాయకులు తూర్పార పట్టారని ఈనాడు తెలిపింది. కేంద్రంపై సమరశంఖం.. అనే టైటిల్ తో ఖమ్మం ఎడిషన్ బ్యానర్ ఐటెమ్ తో సమావేశ వివరాలను కవర్ చేశారు.

‘భారతజాతి విముక్తి కోసమే… అంటూ సాక్షి బ్యానర్ ఐటెమ్ ను ప్రచురించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు, విపక్ష నేతలు ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడ్డతీరును, కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న దమనకాండను హైలెట్ చేసింది. ’దేశమంతా తెలంగాణ మాడల్’… అంటూ మన తెలంగాణ పత్రిక బ్యానర్ ఐటెమ్ ను ప్రచురించింది. కంటి వెలుగు’ కార్యక్రమానికీ విస్తృతమైన కవరేజి మన తెలంగాణ’ దినపత్రికలో వచ్చింది. ’అట్టహాసంగా కంటి వెలుగు.. అనే శీర్షికతో అభివృద్ధి కార్యక్రమాన్ని, ప్రభంజనం.. పోటెత్తిన జనం..’ అంటూ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగినతీరును, అద్భుతం.. నారసింహ క్షేత్రం.. అంటూ యాదాద్రి ఆలయ విశిష్టత, పునర్నిర్మాణంల గురించి జాతీయ నేతల అభిప్రాయాలను మన తెలంగాణలో చక్కగా వివరించారు. ఆంధ్రజ్యోతిలో.. ’మోదీ ఇంటికి.. మనం ఢిల్లీకి’ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో బీఆర్ఎస్ సభకు ప్రధాన కవరేజిని ఇచ్చింది.

దేశం కోసం మహోద్యమం’ అంటూ ఆంధ్రప్రభ బ్యానర్ ఐటెం పెట్టింది. ఆధ్యాత్మిక అద్భుతమే యాదాద్రి’గా కీర్తించింది. ‘వెలుగు’ దినపత్రికలోనూ బ్యానర్ ఐటెం వేశారు. నవ తెలంగాణ’ కవరేజి బాగుంది. దిశ, జనం సాక్షి, ప్రజాతంత్ర, వార్త, ఆదాబ్ హైదరాబాద్ తదితర దిన పత్రికలలోనూ ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ తో పాటుగా యాదాద్రి పర్యటన, కంటి వెలుగు కార్యక్రమాల్లో సీఎంలు, మాజీ సీఎం, జాతీయ నేతల ప్రసంగాలతో కూడిన ముఖ్యాంశాలు, ఇతక విశేషాలను విశ్లేషిస్తూ ప్రత్యేకంగా బ్యానర్ ఐటెమ్ లు, ప్రచురించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ది హన్స్ ఇండియా, ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి జాతీయ వార్తా పత్రికలలో కేసీఆర్ ఉత్కంఠభరితమైన ప్రసంగం, బహిరంగ సభలో ఇతర ప్రముఖుల రాజకీయ నాయకుల ప్రసంగాలు యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. బీఆర్‌ఎస్ బహిరంగ సభ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఆంగ్ల దినపత్రిక ది హిందూ బిఆర్ఎస్ బహిరంగ సభ, కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం, జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలకు తగిన ఫోటోలతో మంచి కవరేజీని అందించింది. వార్తా దినపత్రిక BRS బహిరంగ సభపై మూడు పెద్ద కథనాలను ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు పెద్ద కొత్త కథనాలను మొదటి పేజీ, లోపల పేజీల్లో రంగుల ఫోటోలతో ప్రచురించింది. ఈ కథనాలు భారతదేశం కోసం బిఆర్ఎస్ విజన్‌ను హైలైట్ చేశాయి. ఖమ్మం బహిరంగ సభలో నలుగురు సిఎంలు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా పిలుపునిచ్చిన తీరును ప్రముఖంగా ప్రచురించింది.

డెక్కన్ క్రానికల్ ఖమ్మం బహిరంగ సభను మొదటి పేజీ, లోపలి పేజీల్లో వివిధ అంశాలలో ప్రచురించింది. హన్స్‌ ఇండియా సీఎం కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, పినరయి విజయన్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ప్రసంగాలను ప్రచురించి బహిరంగ సభకు మంచి కవరేజీ ఇచ్చింది. ప్రముఖ యాదాద్రి ఆలయ సందర్శన, ఖమ్మం కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం, ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన వార్తలకు మంచి కవరేజి వచ్చింది.

తెలంగాణ టుడే బీఆర్‌ఎస్ బహిరంగ సభకు మంచి కవరేజీ ఇచ్చింది. మొదటి పేజీతో పాటు లోపలి పేజీల్లో విస్తారంగా వార్తలను ప్రచురించింది. హిందూస్థాన్ టైమ్స్, స్టేట్స్ మన్, ఎకనామిక్ టైమ్స్ కూడా బిఆర్ఎస్ బహిరంగ సభ వార్తలను బాగా కవర్ చేశాయి. పయనీర్ ఢిల్లీ ఎడిషన్ లో కేసీఆర్ నేతృత్వంలో కాంగ్రెసేతర కూటమి ఏర్పడబోతున్నదనే హెడ్డింగ్ తో, సీఎంతో ఉత్తరాది రాష్ట్రాల సీఎంలు అరవింద్ కేజ్రివాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, యుపి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యాదాద్రి ఆలయ ప్రాంగణంలో నడుస్తున్న చిత్రంతో చిన్న వార్తను ప్రచురించారు.

Related posts

కేసీఆర్ బర్త్ డే: నేడు హరిత హారం దినోత్సవం

Satyam NEWS

రాష్ట్రం ఏర్పడ ఎనిమిదేండ్లకు బీజేపీకి బుద్దొచ్చింది..

Satyam NEWS

రూ. 50 కోట్ల కి ఐపీ పెట్టిన లాటరీ శేఖర్ కోసం గాలింపు ముమ్మరం

Satyam NEWS

Leave a Comment