34.2 C
Hyderabad
May 16, 2024 18: 06 PM
Slider మహబూబ్ నగర్

మరో అనాథ కుటుంబానికి గద్వాల్ జిల్లా పోలీసుల అండ

#orphan family

అనాథ పిల్లలకు, పేదలకు, వృద్ధులకు సేవలు అందించేందుకు మానవతా దృక్పథంతో జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఏర్పాటు చేసిన మీ కోసం మేము సైతం సోషల్ రెస్పాసిబిలిటీ టీం ఇప్పటి వరకు 8 కుటుంబాలకు వివిధ రకాలైన సహాయం అందించింది. ఈ రోజు మరో అనాథ కుటుంబాని కి అండగా నిలిచింది. జోగుళాoబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామానికి చెందిన కుమ్మరి శాంతమ్మ(3) ఆర్థిక పరిస్థితులు బాలేక ముగ్గురు ఆడ పిల్లల్ని పోషించలేక పురుగుల మందు తాగి డిసెంబర్ 24న చనిపోయింది.

శాంతమ్మ భర్త కుమ్మరి జమ్మన్న 5 సంత్సరాల క్రితం ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఉరి వేసుకుని చనిపోయాడు. వారికి ముగ్గురు ఆడపిల్లలు 1) పుష్పవతి 14 సంవత్సరాలు 7వతరగతి 2) మమత 10సంవత్సరాలు 5వ తరగతి 3) చేతన్య 8 సంవత్సరాలు 3వ తరగతి చదువుతున్నారు.

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు పిల్లల స్థితిగతులు మీ కోసం మేము సైతం సోషల్ రెస్పన్సిబిలిటీ టీం దృష్టికి రాగా వెంటనే జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు డి.ఎస్పీ ఎన్. సి హెచ్ రంగస్వామి, సాయుధ దళ డి. ఎస్పీ ఇమ్మనియోల్ సూచనలతో పోలీస్ అధికారులు, సిబ్బంది స్పందించి తలా కొంత ఆర్థిక సహాయం అందించడంతో ముగ్గురు అమ్మాయిలకు 6 నెలలకు సరిపడ 17500/- రూపాయల విలువగల నిత్యావసర సరుకులు, 3000 రూపాయల విలువ తలా రెండు జతల బట్టలు, 10,000/- వేల రూపాయల నగదు ఉండవల్లి ఎస్సై బాలరాజు, సైబర్ సెల్ ఎస్సై రజిత టీం సభ్యులు గ్రామస్థుల సమక్షంలో అందించడం జరిగింది.

అనాథ కుటుంబ పరిస్థితి ని తెలుసుకొని సహాయం అందించుటకు సామాజిక బాధ్యతగా భావించి వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించిన సోషల్ రెస్పాన్స్బిలిటీ టీం అధికారులకు, సిబ్బందికి కు జిల్లా ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీo సభ్యులు ఏ. ఎస్సై దేవరాజు, ఐటీ సెల్ ఇంచార్జి నాగరాజు, PRO సురేష్, గ్రామ సర్పంచ్,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

దిక్కు లేని ఉక్కు: త్యాగాలకు వెలకట్టి అమ్ముతుంటే….

Satyam NEWS

బారాముల్లా లో బిజెపి సర్పంచ్ ని కాల్చి చంపిన మిలిటెంట్లు

Satyam NEWS

కొనకమిట్లలో ఘోర ప్రమాదం: నలుగురి మృతి

Satyam NEWS

Leave a Comment